కాంగ్రెస్ గూటికి తెరాస కారు ?.. రేవంత్’కు ఏది దారి ..

Publish Date:Jul 22, 2022

Advertisement

అనుకున్నదే జరిగింది ... కాంగ్రెస్, తెరాస పెళ్లి పీటలు ఎక్కేశాయి.. ఇక మూడు ముళ్ళు పడడం మాత్రమే మిగిలింది. నిజానికి, ఇలాంటి పరిణయ ఘడియలు ఆనివార్యమనే విషయాన్ని తెలుగు వన్ ఎప్పటి నుంచో చెపుతూనే వుంది. అయితే, ఇంత వరకూ అసెంబ్లీ ఎన్నికలకు ముందా, తర్వాత అనే విషయంలోనే కొంత సందిగ్దత మిగిలుంది. ఇక ఇప్పుడు ఆ కాస్త సందేహం కూడా తీరిపోయింది. అవును పెళ్ళితో సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ.. ఒకటయ్యారు. సహజీవనానికి  సిద్ధమయ్యారు.

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం (జూన్ 21)  విచారణ జరిపింది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ, కాంగ్రెస్  పార్టీ చేస్తున్న ఆందోళనకు అనూహ్యంగా, తెరాస మద్దతు తెలిపింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్  గా మారింది. కాంగ్రెస్, తెరాస ఒక్కటైన నేపధ్యంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, ఏ మలుపు తిరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. వివరాలలోకి వెళితే ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలకు పిలుపు నిచ్చింది. కాంగ్రెస్ పిలుపు ఇచ్చిందే. తడవుగా, తెరాస నాయకులు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ పంచన వాలిపోయారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు సహకరించాలని కోరుతూ విపక్షాలకు విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ పార్టమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్ సభలో తెరాస పక్ష నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అవును, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే, ఆ పార్టీలన్నీ మొదటి నుంచి కాంగ్రెస్ పక్షానే ఉన్నాయి. కాంగ్రెస్ తో కలిసే ఉన్నాయి.

కొత్తగా పీటలెక్కింది, తెరాస ఒక్కటే. అంతే కాదు, ఈ సందర్భంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనపై తెరాస టీఆర్ఎస్ తరఫున కే కేశవరావు సంతకం చేశారు. నిజానికి ఇది ఒక్కసారి వచ్చిన మార్పు కాదు. కాంగ్రెస్ పార్టీ పంచన చేరేందుకు తెరాస  చాలా కాలంగా పావులు కదుపుతూనే వుంది. ఒకప్పుడు ఛీ. ఛీ అన్న హస్తం చేయి అందుకునేందుకు, అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలోనూ తెరాస కన్ను గీటుతూనే  ఉంది. అస్సాం ముఖ్యమంత్రి  సోనియా గాంధీని ఏదో అన్నారని, కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసినప్పుడే  కేసీఆర్ కాంగ్రెస్ కోరస్ ట్రూప్ లో చేరారు.

అలాగే ఇంకేదో సందర్భంలో రాహుల్ గాంధీకి కేసీఆర్ జై కొట్టారు. ఇక అక్కడి నుంచి, అవకాశం చిక్కిన ప్రతిసందర్భంలోనూ హస్తానికి దగ్గరగా జరుగుతూనే ఉన్నారు. రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికలను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ కు చేరువయ్యేందుకు, ఢిల్లీలో కేటీఆర్, హైదరాబాద్ లో కేసీఆర్ ఎన్నెన్ని విన్యాసాలు చేశారో, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు, జాతీయ రాజకీయాల ముసుగులో కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష కూటమిలో తెరాస అధికారికంగా చేరింది.  సో . సహజంగానే రాష్ట్ర రాజకీయాలపై,  రాజకీయ సమీకరణాలపై ఇది ప్రభావం ప్రభావం చూపుతుంది.

నిజానికి, కాంగ్రెస్, తెరాస చేతులు కలపడం కాంగ్రెస్ సీనియర్లు చాలా వరకు స్వాగతిస్తున్నారని అంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చేదుకు ఏ బొంత పురుగును అయినా ముద్దాడేందుకు, డిసైడ్ అయిపోయిన తెరాస నాయత్వం కూడా ఎంత సుముఖంగా, ఎంతలా తహతహ లాడుతోందో వేరే చెప్పనక్కరలేదు.

అయితే, ఎటొచ్చి  ఏదో ఆశించి తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  పై ఒంటికాలుపై లేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అయితే కాంగ్రెస్ ఆదిస్థానం తెరాసతో పొత్తు/ చెలిమి / లోపాయి కారి అండర్స్టాండింగ్ దేనికి ఒకే అన్నా, రేవంత్ రెడ్డి కూడా చేయగలిగింది ఏమీ ఉండదని  పార్టీ పెద్దలు అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ దూకుడుకు బ్రేకులు వేసినా ఆశ్చర్య పోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, చివరకు ఏమవుతుంది?

By
en-us Political News

  
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.