Publish Date:Jul 22, 2022
మనుషుల్లో మానవత్వం నశించింది. నగరాలు, పట్టణాల జనాలు తప్ప ఆదివాసీలను పట్టించుకోని నాయకులు తయారయ్యారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆదివాసీల విషయానికి వచ్చేసరికి నీరస పడుతుండడం ఎప్పటినుంచో జరుగుతోంది. మంచిర్చాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీలకు తాత్కాలిక నివాసాలను ఈ నెల ఎనిమిదో తేదీన అటవీ ఆధికారులు తొలగించి మహిళలను ఏడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించారని ఆ ప్రాంతంలో పర్యటించిన వై ఎ స్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీ మహిళలను ఆమె పరామర్శించారు. ఆదివాసీల సమస్య లను తెలుసుకున్నారు. భూముల కోసం 52 కుటుంబాలు పోరాడుతున్నాయని, ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ పాలనలో ఆడవారికి కనీస రక్షణ కూడా లేదని ఆవే దన చెం దారు. పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ మహిళలను బట్టలూడదీసి కొడతారా? ఇంతకంటే నీచ సంస్కృతి ఏమన్నా ఉంటుందా అని ఆమె ప్రశ్నించార
పోడు భూముల్లో పట్టాల కోసం ఆదివాసీల తరపున పోరాడతానని చెప్పారు. అనంతరం ఆమె మంచి ర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో వర్షాల కారణంగా ఇల్లు మునిగి, ఆస్తినష్టం జరగడంతో ఆత్మహత్య చేసుకున్న సిద్ద జమున కుటుంబాన్ని పరామ ర్శించారు. నీట మునిగిన కాలనీల్లో పర్యటిం చారు. కేసీఆర్ వైఫల్యం వల్లనే వరదలు ముంచెత్తా యని విమర్శించారు.
ముంపు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు సరిపోవని, కనీసం రూ.25 వేల చొప్పున చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున వైఎస్సార్ టీపీ తరపున అందజేస్తామని హామీ ఇచ్చారు.
బాధితులకు సాయమేదీ? వరద బాధితులను ఆదుకోవటం లో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వరద తాకిడికి గురైన ఇందిరమ్మ కాలనీని సందర్శిం చారు. బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/care-adivasis-sharmila-demand-25-140279.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.