Publish Date:Jul 22, 2022
శ్రీలంక సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతోందా? ఆ దేశంలో రాజకీయ శూన్యం నెలకొని ఉందా? ప్రజాకాంక్ష ఏమిటన్నది ఆ దేశ నేతలకు తెలియడం లేదా? అర్ధం కావడం లేదా? అసలు విఫల నేత, అసమర్థ నేతగా ప్రజల దృష్టిలో పలుచన అయిన విక్రమ సంఘే వినా మరో నేతే అధ్యక్షపదవికి దొరకపోవడం ఏమిటి? అందుకే ఆ దేశంలో నిరసనలు చల్లారడం లేదు.
ఎమర్జెన్సీని సైతం లెక్క చేయడం లేదు. దేశాధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన గంటలలోనే ఆ దేశంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దేశ ప్రధానిగా రాజీనామా చేసిన సమయంలో విక్రమ సింఘే ఎంత బేలగా మాట్లాడారో.. మళ్లీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి అధికార పగ్గాలు అందుకున్నాక ఆయన స్వరంలో వాడి పెరిగింది.
ప్రజలను బెదరించడానికి, హెచ్చరించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన మాటలకు అనుగుణంగానే.. ఆయన దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఆ దేశ భద్రతా బలగాలు జనంపై విరుచుకుపడ్డాయి. నిరసన కారులు అధ్యక్ష భవనం వద్ద నిరసన కారులు ఏర్పాటు చేసిన టెంటులను తొలగించాయి. నిరసన కారులపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. పలువురు నిరసన కారులు గాయపడ్డారు. క్షతగాత్రులలో మీడియా ప్రతినిథులు కూడా ఉన్నారు. దీంతో మళ్లీ దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పాశవికంగా దాడి చేయడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ లానే తాజా అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె కూడా అణచివేతతో అధికారాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తున్నారని జనం దుమ్మెత్తి పోత్తున్నారు. అణచివేతకు, నిర్బంధానికి తలొగ్గేదే లే అంటు లంక జనం కదం తొక్కుతున్నారు. కొత్త అధ్యక్షుడు విక్రమ సింఘేను తాము ఆమోదించలేమనీ, ఆయన రాజీనామా చేసే వరకూ వెనకడుగు వేసే ప్రశక్తే లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vikramasinghe-is-also-likr-rajapakse-25-140285.html
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.