తెరాసకు రెబల్స్ బెడద..తాండూరు పరిస్థితులే చాలా చోట్ల!

Publish Date:Apr 29, 2022

Advertisement

వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మూడో సారి కూడా ఆ ఫీట్ సాధించాలని భావిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమౌతున్నాయి. టికెట్ ఆశావహుల మధ్య విభేదాలు రచ్చకెక్కి పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఇవి సహజంగానే పార్టీ అధినేతకు కొత్త తలనొప్పులను తీసుకువస్తున్నాయ. అయితే ఈ పరిస్థితికి కారణం మాత్రం అధినేత నిర్వాకమే అని చెప్పాల్సి ఉంది.

వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్నా తెరాస పార్టీ నిర్మాణం మాత్రం పటిష్టంగా లేదు.  క్షేత్ర స్థయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం పోయి...కేసీఆర్ ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చిన వారికి పార్టీ తలుపులు బార్లా తెరిచారు. ఇదే ఇప్పుడు పార్టీలో లుకలుకలకు, అంతర్గత విభేదాలకు కారణమైంది. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ మధ్య అగాధం పెరుగుతూ వచ్చింది. ఎన్నికల ముంగిట టికెట్ల విషయంలో ఇరువురి మధ్యా పోటీ వాతావరణం కారణంగా విభేదాలు భగ్గు మంటున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజక వర్గంలోనూ ఇటువంటి సమస్యలు ఉన్నాయి.

2014 ఎన్నికల అనంతరం నాలుగేళ్లకు అంటే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో కేసీఆర్ ఇరత పార్టీల నుంచి నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ తలుపులు బార్లా తెరిచారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అలా ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరిన వారిలో ఆయా నియోజకవర్గాలలో బలం, పట్టు ఉన్న నాయకులు కూడా ఉన్నారు. అలాగే మొదటి నుంచీ తెరాసలో ఉన్న నేతలూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి వారికి టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గాలలో పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా తాండూరు పరిస్థితికి కారణం ఇదే. కొంచం హెచ్చు తగ్గుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందంటే అతిశయోక్తి కాదు. తాండూరు పరిస్థితే తీసుకుంటే..2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత రోహిత్ రెడ్డి తెరాసలో చేరారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాండూరు నుంచి తెరాస అభ్యర్థిగా తానే రంగంలో ఉంటానని ప్రకటించారు పట్నం మహేందర్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా అలా ఎలా ప్రకటిస్తారన్నది రోహిత్ రెడ్డి అభ్యంతరం.

వాస్తవానికి  తాండూరు మహేందర్ రెడ్డికి కంచుకోట. 2018 ఎన్నికల్లో స్వల్ప  తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత  రోహిత్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు.  ఇప్పుడు తెరాస టిక్కెట్ తనకేనని.. ఆ హామీ మేరకే పార్టీలో చేరానని రోహిత్ రెడ్డి అంటున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అటువంటి అన్ని నియోజక వర్గాలలోనూ తెరాస రెబల్స్ బెడదను ఎదురొన వలసి ఉంటుందన్న ఆందోళన పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నది. 

కొల్లాపూర్,పాలేరు ఇలా తీసుకుంటే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలున్న ప్రతి నియోజకవర్గంలోనూ తెరాసలో అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజ్ లో ఉన్నాయి.  అటువంటి నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానం సముదాయింపులు, బుజ్జగింపులు పని చేసే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గతంలోలా కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు బలోపేతమయ్యాయనీ, అందు వల్ల అసంతృప్తులు పక్క చూపులు చూసే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. ఏది ఏమైనా  ఈ సారి ఎన్నికలలో తెరాసకు రెబల్స్, అసంతృప్తుల ఎఫెక్ట్ బాగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.