లోకేశ్ 'ది లీడర్'.. దమ్మున్నోడు.. త‌గ్గేదేలే వ‌దిలేదేలే..

Publish Date:Apr 29, 2022

Advertisement

‘పోగొట్టుకున్న చోటే వెతకాలి’ ఇది పెద్దలు చెప్పిన మాట. కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వెతకడమే కాదు ఏకంగా వేట మొదలెట్టేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన పూర్తి పట్టు సాధించడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రతినిత్యమూ ప్రజల మధ్యనే ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ హయాంలో ఏపీ వ్యాప్తంగా ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వేగంగా స్పందిస్తున్నారు. బాధిత ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే, లోకేశ్ దూకుడు వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. చినబాబు తుమ్మపూడిలో అడుగుపెడితే.. ఆర్కే అనుచ‌రులు రాళ్ల దాడికి ప్ర‌య‌త్నించారు. ఎస్ఐ త‌ల‌ప‌గ‌ల‌గొట్టారు. ఇలా రౌడీల్లా రెచ్చిపోతే.. కుక్క‌ల్లా మొరిగితే.. లోకేశ్ భ‌య‌ప‌డిపోతార‌ని అనుకున్న‌ట్టున్నారు. కానీ, అక్క‌డ ఉన్న‌ది నారా లోకేశ్‌. రాళ్ల దాడి జ‌రిగినా.. అద‌ర‌లేదు.. బెద‌ర‌లేదు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి.. రాళ్ల దాడిపై అదే రేంజ్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యాయం జ‌ర‌గ‌క‌పోతే 15 రోజుల్లో మ‌ళ్లీ వ‌స్తానంటూ స‌వాల్ చేశారు. ద‌టీజ్ లోకేశ్‌. 

లోకేష్ తన స్లైల్ మార్చారు. ప్రసంగాల్లో వాడీ వేడీ పెంచారు. అధికార పార్టీపైన నిశితంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మరింత అవగాహనతో మాట్లాడుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా… ఇంకా రెండేళ్లే ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలి’ అంటూ వచ్చే ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సమాయత్త పరుస్తున్నారు. చినబాబు లోకేష్ స్పీడును చూసి టీడీపీ శ్రేణులే అవాక్కవుతున్నాయి. మా చినబాబు కెవ్వు కేక అంటూ సంబరపడిపోతున్నారు.

చినబాబు లోకేష్ చాలా రోజులుగా నిత్యం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గం ప్రజల కష్టనష్టాల గురించి తెలుసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీక్షణమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే.. ఎమ్మెల్యేగిరీ చేతిలో పెట్టుకుని ఆళ్ల కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. నియోజకవర్గం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆళ్ల విఫలమైన వైనాన్ని జనానికి అర్థమయ్యేలా చెబుతున్నారు. చంద్రబాబు లాంటి విజనరీ కావాలా? జగన్ లాంటి ప్రిజనరీ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని అంటున్నారు. జనరంజకంగా పాలన సాగించిన రాముడు లాంటి చంద్రబాబు కావాలా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతున్న రాక్షసుడు లాంటి జగన్ కావాలా? నిర్ణయించుకోండంటున్న లోకేష్ మాటలు జనంలోకి బాగా వెళుతున్నాయి.

ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్న లోకేష్ జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై వైసీపీ సర్కార్ ను దుమ్మెత్తిపోశారు. రాజకీయ లబ్ధి కోసం తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసిన జగన్ కు నవ్వుతూ అబద్ధాలాడడం అలవాటంటూ తూర్పారపడుతున్నారు. సొంత బ్రాండ్లతో జనం జేబులు, ఆరోగ్యాలను గుల్ల చేస్తున్న వైసీపీ సర్కార్ తీరును ఎద్దేవా చేస్తూ జగన్ రెడ్డి చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేయడం అందర్నీ ఆకర్షించింది. జేబ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణకు లోకేష్ డిమాండ్ చేశారు.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ను టీడీపీ హయాంలో కొనుగోలు చేసి ఉంటే నిరభ్యంతరంగా తమపై చర్యలు తీసుకోవచ్చని జగన్ సర్కార్ ను ఛాలెంజ్ చేస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని టీడీపీ విధానం అని చెబుతూనే.. అభివృద్ధి వికేంద్రీకణ జరగాలని, పరిపాలన కేంద్రీకృతంగా ఉండాలని చెబుతున్నారు. ఏపీ రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేసిన జగన్ సర్కార్ తీరుపై లోకేష్ చెప్పిన ఈ మాటలు ఆయన పరిపక్వతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మూడేళ్లలో ఒక్క పరిశ్రమను తీసుకురాలేని వైసీపీ.. ఇప్పుడు జిల్లాల విభజన చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అని ఘాటుగా ప్రశ్నించారు. విశాఖను రాబందుల్లా వైసీపీ నేతలు పీక్కు తింటున్నారని దుమ్మెత్తిపోశారు. వైసీపీ కబ్జా కోరల నుంచి విశాఖను రక్షించుకుందామని లోకేష్ పిలుపునివ్వడమే కాకుండా.. బాధితులకు అండగా తాము ఉంటమని భరోసా ఇస్తున్నారు.

ఏపీలో విద్యుత్ సమస్యపై స్పందిస్తూ.. 2019 ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అంటూ సెటైరికల్ వీడియో విడుదల చేశారు. చీటికి మాటికి ఢిల్లీ వెళ్తున్న జగన్ టూర్ దేని కోసం అంటూ.. పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ లోకేష్ ట్విట్టర్ లో పెట్టిన పోల్ బాగా వైరల్ అయింది. ‘అసూయకు మందు లేదు.. అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయి’ అన్న జగన్ కు లోకేష్ ట్విట్టర్ వేదికగా ‘అసూయకు అన్నలాంటి వాడు సీఎం జగన్’ అంటూ గట్టి కౌంటరే ఇవ్వడం గమనార్హం.

‘వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు అంతే స్పీడుగా కౌంటర్ వేయడం లోకేష్ లోని స్పీడుకు నిదర్శనం అంటున్నారు. ‘గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమానిలోడని తేలిపోయిన తర్వాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు.. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెంకించాలనే ఆలోచనతో మేం పనిచేస్తున్నాం.. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి, పిండిబొట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు’ అని కౌంటర్ వేశారు. ఒక వైపున ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూనే మరో పక్కన జగన్ కు వివిధ అంశాలపై లోకేష్ లేఖలు రాస్తున్నారు. ఏపీలో ఇటీవల విధించిన పవర్ హాలిడే ఎత్తేయాలంటూ జగన్ కి లేఖ రాశారు. విద్యుత్ రంగాన్ని నాశనం చేసి, ఏపీని అంధకారంలో నెట్టేయడం సరికాదని తప్పుపట్టారు. ఏపీలోని ధాన్యం రైతుల దైన్యంపైన కూడా జగన్ కు లోకేష్ లేఖ రాశారు. రైతుల నుంచి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

‘అమ్మ ఒడి’ లబ్ధిదారులకు నిబంధనలు పెట్టిన తీరుపై లోకేష్ సెటైర్లు వేశారు. ‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది జగన్ అమ్మ ఒడి పథకం తీరు’ అని సెటైర్ వేశారు. ‘అమ్మ ఒడిని అర్ధ ఒడి’ చేశారని దుయ్యబట్టారు. ఏపీలో జగన్ రెడ్డి ఏలుబడిలో బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై లోకేష్ స్పందించారు. ఆస్పత్రుల ప్రైవేట్ అంబులెన్స్ ల దందాపై స్పందిస్తూ.. చేతగాని పాలకుడు జగన్ చెత్త పాలన కారణంగానే రుయా ఆస్పత్రి నుంచి తన కొడుకు మృతదేహాన్ని ఓ తండ్రి బైక్ పై తీసుకెళ్లిన దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ నిరసనలో భాగంగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టి పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇళ్లపట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా ప్రజలపై కక్షకట్టి ఇళ్లు కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ ను అనుక్షణం నిలదీస్తూనే, మరో పక్కన ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి, సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. మొత్తం మీద పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు చేయాల్సిన కృషి చేస్తూనే.. మంగళగిరిపై మరింత పట్టు పెంచుకునేందుకు కూడా లోకేస్ మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. రాళ్ల దాడులు జ‌రిగినా.. త‌గ్గేదేలే.. వైసీపీ అరాచ‌కాల‌కు బెదిరేదేలే.. జ‌గ‌న్ అండ్ కో ను వ‌దిలేదేలే అంటున్నారు. 

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.