తెరాసకు రెబల్స్ బెడద..తాండూరు పరిస్థితులే చాలా చోట్ల!

Publish Date:Apr 29, 2022

Advertisement

వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మూడో సారి కూడా ఆ ఫీట్ సాధించాలని భావిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమౌతున్నాయి. టికెట్ ఆశావహుల మధ్య విభేదాలు రచ్చకెక్కి పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఇవి సహజంగానే పార్టీ అధినేతకు కొత్త తలనొప్పులను తీసుకువస్తున్నాయ. అయితే ఈ పరిస్థితికి కారణం మాత్రం అధినేత నిర్వాకమే అని చెప్పాల్సి ఉంది. 

వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్నా తెరాస పార్టీ నిర్మాణం మాత్రం పటిష్టంగా లేదు.  క్షేత్ర స్థయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం పోయి...కేసీఆర్ ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చిన వారికి పార్టీ తలుపులు బార్లా తెరిచారు. ఇదే ఇప్పుడు పార్టీలో లుకలుకలకు, అంతర్గత విభేదాలకు కారణమైంది. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ మధ్య అగాధం పెరుగుతూ వచ్చింది. ఎన్నికల ముంగిట టికెట్ల విషయంలో ఇరువురి మధ్యా పోటీ వాతావరణం కారణంగా విభేదాలు భగ్గు మంటున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇటువంటి సమస్యలు ఉన్నాయి.

2014 ఎన్నికల అనంతరం నాలుగేళ్లకు అంటే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో కేసీఆర్ ఇరత పార్టీల నుంచి నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ తలుపులు బార్లా తెరిచారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అలా ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరిన వారిలో ఆయా నియోజకవర్గాలలో బలం, పట్టు ఉన్న నాయకులు కూడా ఉన్నారు. అలాగే మొదటి నుంచీ తెరాసలో ఉన్న నేతలూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి వారికి టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గాలలో పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తాండూరు పరిస్థితికి కారణం ఇదే. కొంచం హెచ్చు తగ్గుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందంటే అతిశయోక్తి కాదు.

తాండూరు పరిస్థితే తీసుకుంటే..2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత రోహిత్ రెడ్డి తెరాసలో చేరారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాండూరు నుంచి తెరాస అభ్యర్థిగా తానే రంగంలో ఉంటానని ప్రకటించారు పట్నం మహేందర్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా అలా ఎలా ప్రకటిస్తారన్నది రోహిత్ రెడ్డి అభ్యంతరం.

వాస్తవానికి  తాండూరు మహేందర్ రెడ్డికి కంచుకోట. 2018 ఎన్నికల్లో స్వల్ప  తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత  రోహిత్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు.  ఇప్పుడు తెరాస టిక్కెట్ తనకేనని.. ఆ హామీ మేరకే పార్టీలో చేరానని రోహిత్ రెడ్డి అంటున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అటువంటి అన్ని నియోజక వర్గాలలోనూ తెరాస రెబల్స్ బెడదను ఎదురొన వలసి ఉంటుందన్న ఆందోళన పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నది. 

కొల్లాపూర్,పాలేరు ఇలా తీసుకుంటే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలున్న ప్రతి నియోజకవర్గంలోనూ తెరాసలో అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజ్ లో ఉన్నాయి.  అటువంటి నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానం సముదాయింపులు, బుజ్జగింపులు పని చేసే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గతంలోలా కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు బలోపేతమయ్యాయనీ, అందు వల్ల అసంతృప్తులు పక్క చూపులు చూసే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. ఏది ఏమైనా  ఈ సారి ఎన్నికలలో తెరాసకు రెబల్స్, అసంతృప్తుల ఎఫెక్ట్ బాగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.