పులివెందులలో చంద్ర‌బాబు బర్త్‌డే.. కేసుల‌తో వేధింపు.. దంపతుల ఆత్మహత్యాయత్నం

Publish Date:Apr 29, 2022

Advertisement

వారు చేసిన త‌ప్ప‌ల్లా ఒక్క‌టే. చంద్ర‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేయ‌డం. అంతే. ఆ మాత్రం దానికే.. క‌క్ష క‌ట్టారు అధికార పార్టీ నేత‌లు. ఈ వేడుక జ‌రిగింది జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఉలిక్కిప‌డ్డారు. లేనిపోని కేసుల‌తో ఆ దంప‌తుల‌ను వేధించారు. ఇప్ప‌టికే ప‌లు కేసుల‌తో ఆ కుటుంబాన్ని ఆగ‌మాగం చేస్తుండ‌గా.. తాజాగా మ‌రో కేసు బ‌నాయించ‌డంతో.. త‌ట్టుకోలేక‌పోయిన ఆ దంప‌తులు ఆత్మ‌హ‌త్య య‌త్నం చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో.. పోలీసుల‌పై ప్రైవేట్ కేసు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది టీడీపీ. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...   పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం చెరువుకాంపల్లెలో టీడీపీకి చెందిన రామాంజనేయులు, కృష్ణవేణి దంపతులు ఇటీవల చంద్రబాబునాయుడి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్‌ కట్‌చేసి ఘ‌నంగా వేడుకలు నిర్వహించారు. ఇది గిట్టని స్థానిక వైసీపీ నేత సురేష్‌.. తన భార్య పద్మజతో దంపతులపై అక్రమ కేసులు బనాయించినట్టు బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.    

పోలీసుస్టేషన్‌కు రావాలంటూ సచివాలయం మహిళా కానిస్టేబుల్‌ ఒత్తిడి తెస్తుండ‌టంతో తీవ్ర మనస్తాపం చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్ర‌యత్నించారు. ఆ భార్యాభ‌ర్త‌ల‌పై గతంలోనూ ఇలాగే రెండు అక్రమ కేసులు పెట్టారని, తరచూ పోలీసులు ఇంటికి రావడాన్ని అవమానంగా భావించి సూసైడ్ అటెంప్ట్ చేశార‌ని చెబుతున్నారు. బాధితులను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. 

అయితే, సూసైడ్ అటెంప్ట్ చేయ‌డం చ‌ట్టప్ర‌కారం నేర‌మంటూ మ‌రో కేసు పెట్టేందుకూ పోలీసులు సిద్ద‌మ‌వుతున్నార‌నే తెలుస్తోంది. కుటుంబ గొడవలు కారణం కావొచ్చని.. పోలీసులు ఇష్యూను సైడ్‌ట్రాక్ ప‌ట్టిస్తున్నార‌ని అంటున్నారు. సీఎం జగన్‌, ఎంపీ అవినాశ్‌రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి త‌మ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. ఈ ఘటనను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. 

By
en-us Political News

  
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.