తోటకు అనుకూలంగా మారుతున్న సమీకరణలు?
Publish Date:May 10, 2012
Advertisement
త్రిముఖపోటీతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నా ఉప ఎన్నికలు వేడెక్కాయి. ఈ స్థానంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బిసిలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమీకరణలు మారుతున్నాయి. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులకు అనుకూలమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ తాజా మాజీ, మాజీ మంత్రి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష చంద్రబోస్ కు అనుకూలంగా ఉందని గతంలో భావించారు. ఇటీవల ప్రచారంలో భాగంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ తన సామాజికవర్గమైన ఎస్సీ ఓట్లు ఇతర పార్టీల (కాంగ్రెస్ కు మాత్రమే ఓటు వేసేలా)కు పడకుండా కట్టడి చేశారు. దీనికి ఎస్సీ నాయకులంతా సమ్మతించి ఈ మేరకు కృషి చేస్తున్నారు. అలాన్గే కాపు సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్ర రావును ఈ ఎన్నికల నుంచి తప్పుకోమని సామాజికవర్గ నాయకులు ఒత్తిడి చేశారు. పార్టీ నిర్ణయం మేరకు పోటీలో ఉంటానని చిక్కాల చెప్పటంతో కాపులంతా సమైక్యంగా తోటకు మద్దతు ఇవ్వాలని ఆ వర్గ నాయకులు ప్రచారం చేశారు. బీసీల్లో మాజీ మంత్రి పిల్లి సుభాష చంద్రబోస్ పై అసంతృప్తి ఉన్న నాయకులను కాంగ్రెస్ అభ్యర్థి తోట పిలిపించి వారితో మంతనాలు జరిపారు. తాను కనుక విజయం సాధిస్తే బిసీలకు అవసరమైన పనులు చేసిపెడతానని హామీ ఇవ్వటంతో వారు కూడా తోటకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇలా రాజకీయ సమీకరణలు మారటంతో తోట గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు తేల్చి చెపుతున్నారు.
http://www.teluguone.com/news/content/triangular-fight-in-ramachandrapuram-24-13933.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





