ఎంపీ హర్షకుమార్ పై ప్రధానికి యానాం ఎమ్మెల్యే మల్లాడి ఫిర్యాదు
Publish Date:May 10, 2012
Advertisement
ఇటీవల మూతపడిన కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ వ్యవహారం కేంద్ర స్థాయికి చేరింది. ఈ పరిశ్రమ వైస్ చైర్మన్ నాయుడు హత్య, ఆ తరువాత లాకౌట పరిణామాలు ఓ సంచలనమయ్యాయి. ఈ పరిణామాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు యానాంలో రీజెన్సీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి కాంగ్రెస్ తరుపున అమలాపురం ఎంపీ జి.వి .హర్షకుమార్ యానాంలో కార్మికులతో ఒక కొత్త గ్రూపును నెలకొల్పారు. ఈ గ్రూపును ముందేసుకుని ఆయన స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుపై విమర్శల వర్షం కురిపించారు. ఒకదశలో మల్లాడిని అరెస్టు చేయాలన్నంత సీరియస్ గా ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానాలు చేశారు. ఆ తరువాత పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ తో హర్షకుమార్ ముందుకు వెళ్ళారు. ఈ దశలో ఎమ్మెల్యే మల్లాడి క్రిష్ణారావు యానాం కార్మికుల విజ్ఞాపనలను తీసుకుని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. తమ ప్రాంతానికి పేరు తెచ్చిన రీజెన్సీ పరిశ్రమలు మూడింటినీ తిరిగి తెరిపించాలని డిమాండ్ చేస్తూనే యానాం అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని కృష్ణారావు కోరారు. తమ ప్రాంతంలో ఎంపీ హర్షకుమార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ కు ఫిర్యాదు చేశారు. ప్రధాని జోక్యం చేసుకుంటే హర్షకుమార్ యానాం వైపు కన్నెత్తి చూడరన్న మల్లాడి వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో తెరపై చూడాల్సిందేనని వారు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/mallaadi-krishnarao-complains-on-mp--harsha-kumar-to-prime-minister-24-13934.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





