బొత్స, బండ్ల గణేష్ బంధంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు
Publish Date:May 10, 2012
Advertisement
పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, కమెడియన్ గా సినీజీవితం ప్రారంభించి నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ మధ్య ఉన్న సంబంధబాంధవ్యాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, ఆజాద్, వాయలార్ రవికి ఫిర్యాదులు పంపించినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ తన అక్రమార్జనలతో బండ్ల గణేష్ ద్వారా సినిమాలు తీయిన్చారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలు తీయటం తప్పుకాదని అయితే, అక్రమంగా ఆర్జించిన డబ్బుతో బొత్సా సత్యనారాయణ సినిమాలు తీస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బండ్ల గణేష్, బొత్స సత్యనారాయణ పేరు చెప్పుకొని అనేక అక్రమాలకూ పాల్పడ్డాడని, తాను హత్య చేసినా బొత్స పెద్ద మనస్సుతో తనను క్షమిస్తారని బండ్ల గణేష్ ఇటీవల ఒక సమావేశంలో బహిరంగంగానే ప్రకటించారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. బొత్స కూడా గణేష్ తో తనకున్న అనుబంధాన్ని దాచుకోవటానికి ఏమీ ప్రయత్నించలేదు. బొత్సా నిర్వాకం వల్ల పార్టీ పరువు బజారున పడుతోందని కొందరు కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి పంపించిన పంపించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బొత్స ఇమేజ్ ఇప్పటికే దారుణంగా దెబ్బతింది. మద్యం మాఫియాతో ఆయనకు ఉన్న లింకులను ఎసిబి బయటపెట్టడం, ఆ పని చేయించింది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని బొత్స భావించటంతో వీరిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. అధిస్థానం వీరిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చిన రెండు రోజులకే బొత్సపై మళ్ళీ ఆరోపణలు రావటం విశేషం.
http://www.teluguone.com/news/content/relationship-between-botsa-and-bandla-ganesh-24-13932.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





