పిల్లలతో ఇలాంటి మాటలు మాట్లాడకండి.. వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది..!

Publish Date:Nov 25, 2025

Advertisement

 


ఆత్మవిశ్వాసం అనేది అన్ని వయసుల వారికి ఎంతో ముఖ్యం.  ఇది జీవితం మెరుగ్గా మలుచుకోవడంలో, ఏదైనా ఒక పనిని చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత సులువైన పని అయినా సరిగా చేయలేరు.  ఎంత తెలివైన వారైనా సరే.. ఆత్మవిశ్వాసం లేకపోతే ఆ తెలివి తేటలు మొత్తం వ్యర్థమే.. ఇక చిన్న పిల్లల విషయంలో ఇది మరీ ముఖ్యం.  ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుండి మెరుగ్గా ఎదగాలంటే వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉండాలి.  పిల్లలో ఆత్మవిశ్వాసం అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,స్నేహితులు.. ఇలా అందరి ద్వారా డవలప్ అవుతూ ఉంటుంది.  కానీ తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడే కొన్ని మాటల వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేస్తుంది.  ఇది కాస్తా వారి భవిష్యత్తుకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది.  ఇంతకీ తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడకూడని విషయాలేంటో తెలుసుకుంటే..

పోలిక..

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను, పిల్లల పనితీరును ఇతర పిల్లలతో పోల్చి చూస్తారు. అలా పోల్చి చూసిన విషయాన్ని నేరుగా తమ పిల్లలతోనే చెబుతారు.  నీకు తక్కువ మార్కులు వచ్చాయి. కానీ నీ ఫ్రెండ్ కు బాగా వచ్చాయి,  నువ్వు చెప్పిన పని  చేయవు, కానీ మీ బాబాయ్ కొడుకు తల్లిదండ్రుల మాట చెప్పినట్టు వెంటాడు.. ఇలా ప్రతి విషయంలో పిల్లలను తమ కంట్రోల్ లో పెట్టుకోవడానికో లేదా పిల్లల ప్రతిభను గుర్తు చేయడానికో ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తాము అసమర్తులం అనే అపోహలో పడిపోయి తమలో ఉన్న కాసింత ప్రతిభను  కూడా మరుగుపరుచుకుంటారు.

పట్టించుకోకపోవడం..

కొందరు తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఏం కావాలో తమకే బాగా తెలుసు అని  అనుకుంటారు. దీని వల్ల తమ పిల్లలు ఏదైనా అడిగినా, వారు ఏదైనా సమస్య చెప్పుకున్నా.. దాన్ని తమ మనస్తత్వంతో ఆలోచించి పిల్లల బావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. దీనివల్ల పిల్లలు ఏమీ తెలియని వాళ్లలా పెరుగుతారు.  ప్రతి దానికి తల్లిదండ్రుల వైపు చూసే పరిస్థితి ఏర్పడుతుంది.

అసంతృప్తి..

పిల్లలు ఏదైనా పని చేసినా, ఏదైనా నేర్చుకోవడానికి లేదా పోటీలలో పాల్గొనడం, లేదా పరీక్షలు, చదువు ఇలా పిల్లలు చేసే ప్రతి విషయంలో తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.  వారి నుండి ఏ చిన్న అబినందన కూడా పిల్లలకు లభించకపోవడంతో తాము ఏం చేసినా, ఏం సాధించినా తల్లిదండ్రులు మెచ్చుకోరు అనే అబిప్రాయంలోకి వెళ్లిపోయి తమ ఎదుగుదలను  తామే ఆపేసుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ప్రతి విషయానికి పిల్లల మీద అసంతృప్తి చూపించకూడదు.

పిల్లల పని..

కొందరు తల్లిదండ్రులకు పిల్లలు కష్టపడుతుంటే చూసి భరించలేనట్టు ఉంటారు. పిల్లలను అతిగా గారాబం, అతి ప్రేమ చూపించడం వల్ల వచ్చే సమస్య ఇది.  పిల్లల పనులన్నీ  తల్లిదండ్రులే చేసి పెట్టడం వల్ల పిల్లలు చేతకానివాళ్లుగా తయారవుతారు. ఇది వారికి భవిష్యత్తులో పెద్ద ఆటంకంగా మారుతుంది.

                                         *రూపశ్రీ.

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.