మానసిక స్థితిని మెరుగ్గా ఉంచే అలవాట్లు ఇవి..!

Publish Date:Nov 21, 2025

Advertisement

ప్రతి మనిషి రెండు రకాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలి.  ఒకటి శారీరక ఆరోగ్యమైతే.. రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక  ఆరోగ్యం గురించి చాలామంది ఆలోచన చేస్తారు.  మంచి శారీక ఆరోగ్యం కోసం చాలా రకాల టిప్స్ ఇంకా మంచి జీవనశైలి పాటించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించే వారు చాలా తక్కువ.  మరీ ముఖ్యంగా..  ఉద్యోగాలు, వ్యాపారాల కోసం మెదడు మీదే ఎక్కువ ఒత్తిడి పెడుతున్న నేటి కాలంలో మానసిక స్థితి మెరుగ్గా ఉండాలంటే కొన్ని అలవాట్లు చక్కగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..


మానసిక స్థితిని మెరుగ్గా ఉంచే అలవాట్లు..

కృతజ్ఞత కలిగి ఉండాలి..

కృతజ్ఞత అనేది మనిషిని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది. బయట ఏవో విషయాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అవసరమే లేదు. కనీసం ప్రతి రోజూ.. రోజు మొత్తంలో జరిగిన విషయాలలో మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ, రోజులో మంచి జరిగినందుకు కృతజ్ఞతగా సంతోషంగా, తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఈ ఒక్క అలవాటు ప్రతి రోజూ చాలా పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది.

వ్యాయామం..

ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు పాటు శారీరక వ్యాయామం చేయాలి.  వ్యాయామం చేయలేకపోతే కనీసం స్ట్రెచింగ్ వర్కౌట్లు అయినా చేయాలి.  శరీరం ఎప్పుడైతే చురుగ్గా ఉంటుందో అప్పుడు మానసికంగా మెరుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తగ్గుతుంది.

శ్వాస వ్యాయామాలు..

శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి వ్యాయామాలు ఎలా అవసరమో.. మానసిక స్థితిని చురుగ్గా ఉంచడానికి లోతైన శ్వాస వ్యాయామాలు అంతే అవసరం. ప్రతి రోజూ లోతుగా శ్వాస తీసుకుంటూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

మైండ్ ఫుల్ నెస్..

మైండ్ ఫుల్ నెస్ అనేది మనసు పెట్టి పని చేయడాన్ని ప్రోత్సహిస్తుంది.  ఆహారం తింటున్నా, వ్యాయామం చేస్తున్నా,  ధ్యానం చేస్తున్నా,  పని చేస్తున్నా.. కేవలం ఆ పని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టడం వల్ల మానసికంగా మెరుగ్గా ఉండవచ్చు.  

ప్రకృతితో సమయం..

ఎప్పుడూ ఇల్లు, ఆఫీసు అంటూ గడపడం కాదు.. బయట ప్రకృతితో సమయం గడపాలి. చెట్లు, మొక్కలు,  పువ్వులు,  పక్షులు, జంతులు, సూర్యకాంతి,  వాతావరణం.. ఇవన్నీ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది.  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

బంధాలు బలంగా..

మనిషి మానసిక స్థితిని బలంగా ఉంచడంలో సంబంధాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మన వాళ్లు అనుకున్న వాళ్లతో ఏదైనా విభేదాలు వస్తే.. అవి మానసికంగా చాలా దెబ్బతీస్తాయి.  కాబట్టి మానసికంగా బలంగా ఉండటానికి ఇష్టమైన వారు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు.. ఇలా అందరితో సమయం గడుపుతూ బంధాన్ని బలంగా ఉంచుకోవాలి.

నచ్చిన పని చేయడం..

నచ్చిన పని చేసినప్పుడు, నచ్చిన ఆహారం తిన్నప్పుడు, నచ్చినట్టు సమయం గడిపినప్పుడు లభించే తృప్తి చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుకోవడానికి స్వీయ తృప్తిని ఇచ్చే పనులు చేస్తుండాలి.

                              *రూపశ్రీ.

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.