భార్యభర్తల మద్య ఎమోషన్ దూరాన్ని తగ్గించే చిట్కాలు..!

Publish Date:Nov 26, 2025

Advertisement


ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది. కానీ ఎమోషన్ అటాచ్మెంట్ తగ్గితే ఆ బంధాలు స్పాయిల్ అయ్యే దిశగా వెళతాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ఎమోషన్స్ అనేవి ఇద్దరినీ కలిసి ఉండేలా చేస్తాయి.  కానీ ఇప్పటికాలం వేగవంతమైన ప్రపంచంలో కెరీర్ పరంగా ఉండే హడావిడి, సోషల్ మీడియా, ఒత్తిడులు,  ఇతరుల జోక్యం.. ఇట్లా ఏదైనా కావచ్చు.  మనుషులను ఒక్కసారిగా బంధం నుండి విడదీయకుండా నెమ్మదిగా బంధం మసకబారిపోయేలా చేస్తాయి. భార్యాభర్తల మధ్య సాధారణంగానే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.  కానీ ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది ఒక్కరోజులో ఏర్పడదు, అలాగే ఒకేరోజుతో తెగిపోదు.  కాకపోతే భార్యాభర్తల మధ్య ఎమోషన్ బాండింగ్  లో దూరాన్ని తగ్గించడం కష్టమేమి కాదు. కొన్ని చిన్న చిట్కాల ద్వారా భార్యాభర్తల మధ్య ఎమోషన్ దూరాన్ని తగ్గించి తిరిగి బంధం బలంగా మారేలా చేయవచ్చు.  దీనికోసం సహాయపడే చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

నాణ్యమైన సమయం..

నేటికాలంలో ఎప్పుడూ ఫోన్ పట్టుకుని ఉండటం అందరికీ అలవాటు. కానీ ఇలా పోన్ ను చూస్తుండటం వల్ల కనీసం లైప్ పార్ట్నర్ ముఖాన్ని సరిగా చూసి మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే లైఫ్ పార్ట్నర్ తో ఉన్నప్పుడు నాణ్యమైన సమయాన్ని గడపాలి.  ఫోన్ తో సహా అన్నింటిని పక్కన పెట్టి ఇద్దరూ విలువైన సమయాన్ని గడపగలిగితే వారి మధ్య దూరం తగ్గుతుంది.

ఓపెన్ గా..

ఎమోషన్స్ ను మనసులోనే దాచుకుంటే అవి ఎవ్వరికీ, ఎప్పటికీ అర్థం కావు. కాబట్టి ఎమోషన్స్ ఏవైనా సరే ఓపెన్ గా బయటకు చెప్పగలిగితే అప్పుడే అవి ఎదుటి వ్యక్తికి అర్థం అవుతాయి. మనసులో ఉండే విషయం ఏదైనా ఓపెన్ గా తనతో చెప్పుకోగలుగుతారు అనే ఒక నమ్మకం భాగస్వామికి కలిగితే  ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్ దూరం తగ్గి ఇద్దరూ మానసికంగా దగ్గరవుతారు.

ప్రేమ.. ప్రకటన..

అందరూ ప్రేమను ఒకేలా వ్యక్తం చేయలేరు.. ఇది చాలామంది చెప్పే డైలాగ్.. కానీ ఒకే రకంగా వ్యక్తం చేయలేకపోయినా కనీసం తమకు చేతనైన విధంగా అయినా ప్రేమను వ్యక్తం చేస్తేనే  ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలంగా మారుతుంది. అందుకే రోజులో ఏదో ఒక సందర్బంలో ఏదో ఒక విధంగా ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి.

గొడవ.. అవగాహన..

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. మరీ ముఖ్యంగా ఇద్దరూ ఒకరినొకరు నిందించుకుంటూ,  తప్పులు ఎత్తి చూపుకుంటూ గొడవ పడుతుంటారు.  కానీ గొడవ పడటం కంటే ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వస్తోంది,  దానికి కారణం ఏంటి? గొడవలు రాకుండా ఉండటానికి ఏం చేయాలని ఆలోచిస్తే ఇద్దరి మధ్య గొడవలు తగ్గి ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది.  దూరం తగ్గుతుంది.

శారీరకంగా.. మానసికంగా..

కొందరు బార్యాభర్తలను చూస్తే వారు కేవలం శారీరక బందం కోసం బార్యాభర్తలుగా ఉంటారు. కానీ భార్యాభర్తల బంధం అనేది కేవలం శారీరక బందమే కాదు.. మానసిక బంధం కూడా.  మానసికంగా ఇద్దరూ ఒక్కటిగా ఉన్నప్పుడు శారీరక బంధం వారిని మరింత దగ్గర చేస్తుంది. అంతే కానీ మానసికంగా ఎలా ఉన్నా శారీరకంగా ఒకటిగా ఉంటే సరిపోతుంది అనుకోవడం భ్రమ.

నియమాలు.. షేరింగ్..

చాలామంది బార్యాభర్తలు ఒకరికి ఒకరు నియమాలు విధిస్తుంటారు. నిజానికి ఇలా నియమాల మీద ఎదిగేది కాదు భార్యాభర్తల బందం అంటే.   బార్యాభర్తల బంధం ఎప్పుడూ ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నారు,  ఒకరికోసం ఒకరు ఎలా సమయాన్ని గడుపుతారు,  ఇద్దరూ కలిసి ఎలా టైం లీడ్ చేసుకుంటారు అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది బంధాన్ని స్థిరంగా ఉంచుతుంది.  బంధానికి భద్రతను ఇస్తుంది.

                                         *రూపశ్రీ.

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.