Publish Date:Dec 28, 2025
భూతల స్వర్గం అరకు.. అల్లూరి జిల్లా పర్యాటకులతో నిండిపోయింది. వరుస సెలవులతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు రావడంతో నిన్న రాత్రి నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. హొటల్ గదులు ఫుల్ అయ్యాయి. ఆదివారం కావడంతో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలకు టూరిస్టుల తాకిడంతో ఉడెన్ బ్రిడ్జి వద్ద పెరిగిన రద్దీ పెరిగింది.
చల్లని వాతావరణాన్ని ఆహ్లాదించేందుకు… టూరిస్టులు వస్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను కెమెరాలను బంధిస్తున్నారు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్ కి తెగ డిమాండ్ పెరిగింది.బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ, మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, చాపరాయి గెడ్డ, పాడేరు కాఫీ తోటలు, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి ప్రాంతాల్లో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో రద్దీ నెలకొంది. శనివారం రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు కూడా భారీగా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tourist-rush-in-araku-36-211676.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.