జీహెచ్‌ఎంసీ విభజన...కమిషనరేట్‌లో కీలక మార్పులు
Publish Date:Dec 28, 2025
Advertisement
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పునర్వి భజన నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలకమైన, దీర్ఘకాల ప్రభావం చూపే నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, అంతర్జాతీయ విమానా శ్రయం, ఐటీ కారిడార్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అనే మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్‌లలో భారీ స్థాయి రీ–షఫ్లింగ్ చేపట్టనున్నారు.ఈ మార్పుల్లో భాగంగా మూడు కమిషనరేట్‌లను మొత్తం 12 జోన్‌లుగా విభజిస్తూ, జోన్‌ల సరిహ ద్దులు, అధికార పరిధులను పూర్తిగా పునర్‌వ్యవస్థీక రించారు. ఈ నిర్ణయాలతో పోలీసింగ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా, వేగంగా పని చేసేలా మారనుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. 12 జోన్‌లుగా మూడు కమిషనరేట్‌లు పోలీస్ శాఖ తాజా ప్రణాళిక ప్రకారం –హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్‌లు,సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 జోన్‌లు,రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. నగర పరిధిలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణలో స్పష్టత తీసుకురావడమే ఈ పునర్విభజన లక్ష్యమని అధికారులు పేర్కొంటు న్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో కీలకమైన మార్పులు ఈ రీ–షఫ్లింగ్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకున్నది. ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్‌లను హైదరాబాద్ కమిషనరేట్‌లో విలీనం చేయనున్నారు.దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రానుంది. విమానాశ్రయ భద్రత, వీఐపీ కదలికలు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పోలీసింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ మార్పు ఉపయోగప డుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని జోన్‌లు: చార్మినార్ జోన్ పాత నగరం నుంచి కొత్త నగరం, విమానాశ్రయం వరకు ఒకే కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసింగ్ ఉండటం వల్ల సమన్వయం మరింత మెరుగవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.సైబరాబాద్ కమిషనరేట్‌లో విస్తృత రీ–అలైన్‌మెంట్ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన సైబరాబాద్ కమిషనరేట్‌లో కూడా భారీ మార్పులు చోటుచేసుకో నున్నాయి. శేరిలింగంపల్లి జోన్ పరిధిని మొయినాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు విస్తరించనున్నారు. దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాంతాల్లో పోలీస్ నిఘా మరింత బలోపేతం కానుంది. అలాగే కూకట్పల్లి జోన్ పరిధిలోకి మాదాపూర్ ప్రాంతాన్ని చేర్చనున్నారు. కుత్బుల్లాపూర్ జోన్ యథాతథంగా కొనసాగనుంది. ఐటీ ఉద్యోగులు, బహుళజాతి కంపెనీలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేరాల నియం త్రణకు ఈ పునర్విభజన ఉపయోగపడుతుందని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అవి ఎల్‌బీ నగర్ జోన్ ఈ జోన్‌ల పరిధిలో పెరుగుతున్న నివాస కాలనీలు, అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. పోలీస్ శాఖ మరో కీలక భవిష్యత్ నిర్ణయంపై కూడా దృష్టి సారించింది.మహేశ్వరం జోన్, షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. శాంతిభద్రతల పటిష్టతే లక్ష్యం నగర విస్తరణకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం, నేరాల నియంత్రణలో సమర్థత పెంచడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించిన అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
గోల్కొండ జోన్
ఖైరతాబాద్ జోన్
రాజేంద్రనగర్ జోన్
సికింద్రాబాద్ జోన్
శంషాబాద్ జోన్
రాచకొండ కమిషనరేట్‌లో మూడు జోన్‌లు రాచకొండ కమిషనరేట్‌లో ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని కొనసాగిస్తూ మూడు జోన్‌లుగా విభజన కొనసాగనుంది.
మల్కాజిగిరి జోన్
ఉప్పల్ జోన్
‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’పై కసరత్తు
రాబోయే రోజుల్లో పరిశ్రమలు, ఐటీ పార్కులు, భారీ నివాస ప్రాజెక్టులు ఏర్పడనున్న ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికతో పోలీసింగ్ వ్యవస్థను సిద్ధం చేయాలన్నదే ఈ ప్రతిపాదన ఉద్దేశం...అదే విధంగా యాదాద్రి జిల్లాను ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చి, ఎస్పీ స్థాయి అధికారితో పోలీస్ పరిపాలన నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
http://www.teluguone.com/news/content/ghmc-division-36-211671.html





