రాజకీయాలలో టాలీవుడ్ కరివేపాకులు!

Publish Date:Jul 17, 2023

Advertisement

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఫిల్మ్ గ్లామర్ ఒక అసెట్. అందులో సందేహం లేదు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచీ సినీమా ప్రభావం చాలా చాలా ఎక్కువగానే ఉంది. కలావాచస్పతిగా గుర్తింపు పొందిన కొంగర జగ్గయ్య, డాక్టర్ ప్రభాకరరెడ్డి వంటి వారు ఇటు సినిమాలలోనూ.. అటు రాజకీయాలలోనూ రాణించారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత సినీ గ్లామర్ అనేది రాజకీయాలకు ఒక అదనపు హంగుగా ఇమిడిపోయింది. ఎన్టీఆర్ తరువాత తెలుగుదేశంలో  సినీ గ్లామర్ కు  చంద్రబాబు నాయుడు కూడా సముచిత స్థానం ఇచ్చారు.

తమ ప్రచారం ద్వారా పార్టీకి అదనపు ఆదరణ కలిగేందుకు దోహదపడిన వారికి సముచిత పదవులు హోదా కల్పించి గౌరవంగా చూసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తరువాత కాంగ్రెస్ కూడా అనివార్యంగా సినీ స్టార్లకు పార్టీలో అవకాశం ఇచ్చింది. హీరో కృష్ణ వంటి వారు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా చట్ట సభలకు కూడా ఎన్నికయ్యారు. అయితే ఆ పార్టీలో వారికి సరైన గుర్తింపు లేదన్న భావనతో క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తెలుగుదేశం మాత్రం సినీ పరిశ్రమ సేవలను సమర్థంగా వినియోగించుకోవడమే కాకుండా.. పార్టీకి సేవలందించిన వారికి సరైన ప్రాధాన్యత కూడా ఇచ్చి ప్రోత్సాహించింది. నటుడు మోహన్ బాబుకు రాజ్యసభ సభ్యత్వం, ప్రస్తుత మంత్ర రోజాకు అప్పట్లో అంటే ఆమె తెలుగుదేశంలో ఉన్న సమయం తెలుగు మహిళా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. 

రాష్ట్ర విభజన తరువాత కూడా  విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం సినీ పరిశ్రమ సేవలను ఉపయోగించుకుంటూనే వచ్చింది. వస్తోంది. అదే కోవలో వైసీపీ కూడా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకున్నప్పటికీ... వారి పట్ల యూజ్ అండ్ త్రో వైఖరినే అవలంబిస్తూ వస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

వైసీపీలో చేరిన నటులు జీవిత, రాజశేఖర్ వంటి వారు గుర్తింపు కరవై దూరమయ్యారు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. దర్శకులు ఎస్పీ కృష్ణారెడ్డి వైసీపీకి సేవలందించే ఉద్దేశంతో పార్టీలో చేరినప్పటికీ ఆయనను పట్టించుకునే నాథుడే లేకపోయాడు.  ఇక 2019 ఎన్నికల సమయంలో పార్టీ కోసం సినీ కెరీర్ ను కూడా ఫణంగా పెట్టి  పని చేసిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, లవ్ యూ రాజా అనే ఊతపదంతో పాపులర్ అయిన సినీ రచయత నటుడు పోసాని కృష్ణ మురళి, కాట్రవల్లి అలీల పరిస్థితి అలాగే తయారైంది. వీరిలో తన స్థాయి మరచి విపక్షంపైనా మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకున్న ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ కు ముందుగా ఓ పదవి దక్కింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

వివాదంలో చిక్కుకున్న ఆయన పదవిని ఊడబెరికిన జగన్ ఆ తరువాత కనీసం పట్టించుకోలేదు. దీంతో తనేకు అంతో ఇంతో పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన సినీ పరిశ్రమకూ. రాజకీయాలకూ కూడా పనికిరాని పుష్పంగా మిగిలిపోయారు. ఇక పోసాని, అలీల విషయానికి వస్తే.. వైసీపీ విజయానికి కూలీలుగా పని చేసిన వీరిద్దరికీ పదవుల ఆశ చూపిన జగన్.. పార్టీ విజయం తరువాత పూర్తిగా విస్మరించారు. ముఖ్యంగా అలీ అయితే.. 2019 ఎన్నికలలో పోటీయే లక్ష్యంగా రాజకీయ ప్రవేశం చేశారు. ఇందు కోసం ఆయన తెలుగుదేశం, జనసేన పార్టీలతో సంప్రదింపులు జరిపి చివరకు వైసీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికలలో అలీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు.

కానీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, రాజ్యసభ సభ్యత్వం వంటి హామీలు లభించడంతో.. పోటీకి అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తిని మనసులోనే దిగమింగుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే.. చివరికి మూడు సంవత్సరాల తరువాత అలీకి దక్కింది ఓ సలహాదారు పదవి. పోసాని పరిస్ఠితీ అంతే. స్థాయికి తగ్గ పదవులు కాకున్నా అలీ, పోసాని కూడా మరో గత్యంతరం లేక ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా అలీ విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీలో స్టార్ కమేడియన్ గా ఆయన స్థాయే వేరు. ముఖ్యంగా పవన్  కల్యాణ్ కు ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని అలీ వైసీపీలో చేరడానికి ముందు వరకూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. వైపీసీలో చేరిన తరువాత అలీ పవన్ కల్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో అటు స్నేహానికీ దూరం కావడమే కాకుండా సినీ అవకాశాలు సైతం బాగా తగ్గిపోయాయి. వచ్చే ఎన్నికలలోనైనా పోటీకి  జగన్ పార్టీ టికెట్ ఇస్తారా అంటే ఆ నమ్మకమూ లేదు. వైసీపీ పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఒక వేళ అవకాశం దక్కినా గెలుపుపై నమ్మకాలూ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో అలీ పరిస్థతి అగమ్య గోచరంగా మారిందని పరిశీలకులు అంటున్నారు.  

తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఓ వెలుగువెలిగిన కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. వైసీపీ కండువా కప్పుకున్న తరువాత ఆ పార్టీలో కనీస గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు.  కరుణామయుడు సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయచందర్ వైసీపీలో చేరి ఎందుకూ కొరగాకుండా పోయారు.  భానుచందర్, హాస్య నటుడు కృష్ణుడు ఎందరో అటు సినీమాలకు దూరమై, ఇటు రాజకీయంగానూ గుర్తింపునకు నోచుకోక అనామకంగా మిగిలిపోయారు.  మధ్యలో   హీరో నాగార్జున, నటి రాశి ముఖ్యమంత్రి జగన్ ను కల్సినప్పటికీ ఆ పార్టీలో చేరడానికి మాత్రం ముందుకు రాలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం వైసీపీకి లేదని అర్ధమౌతున్నది. అలాగే వైసీపీకి కూడా సినీ పరిశ్రమకు చెందిన వారిని యూజ్ అండ్ త్రో గా వాడుకుని వదిలేయడమే తప్ప వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమౌతోంది.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.