స్పీడ్ న్యూస్ 4

Publish Date:Jul 17, 2023

Advertisement

31. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముఖచిత్రం మారిపోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఉజ్వల పథకం కింద దేశంలో పది కోట్ల మందికి మోడీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని ట్వీట్ చేశారు. మహిళలు పొగపొయ్యిలతో ఇబ్బందులు పడే రోజులు పోయాయన్నారు.

..............................................................................................................................................

32.   రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ  మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై  స్పందించిన రేవంత్  ప్రాసకోసం పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ ఎద్దేవా చేశారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

...............................................................................................................................................................

33.  ఇచ్చిన హామీలను అమలు చేయనందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

.......................................................................................................................................

34.  ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్ కు శ్రీకారం చుట్టింది.  తొలుత కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో  ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 

............................................................................................................................................................

35.  అన్నమయ్య జిల్లా నవాబుకోటలో  టమోటా సాగు చేసే రైతు మధుకర్ దారుణ హత్యకు గురయ్యారు. తన టమోటా పంటకు కాపలాగా పడుకున్న మధుకర్ ను  దుండగులు పొలంలోనే గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. 

...............................................................................................................................................................

36.  విజవాడ ధర్నా చౌక్ లో సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.  తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

..........................................................................................................................................................`

37. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో  ఓ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులో ఉన్న సెక్యూరిటీ గార్డు మరణించాడు. ఆదివారం ఉదయమే అతడు లాకప్ లో మరణించగా సాయంత్రం వరకు పోలీసులు నిందితుడు మరణించిన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

..........................................................................................................................................................

38. గుంటూరు హిందూ కళాశాల కూడలిలో  తెలుగుదేశం బీసీ నాయకుల ఆందోళన చేపట్టారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన  పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

............................................................................................................................................................

39. ఏలూరు ఎస్పీ కార్యాలయం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ ను ఆందోళనకు దిగారు.   ప్రభుత్వం వాడుకున్న  14, 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలంటూ నినాదాలు చేశారు. 

........................................................................................................................................................

40. వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామంటూ సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

By
en-us Political News

  
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.