తెలంగాణ ఆలయాలకు తిరుమల నిధులు.. ఎందుకు వివాదం అవుతోందంటే?

Publish Date:Jun 26, 2026

Advertisement

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చుట్టూ ఇప్పుడు   కొత్త  వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక జీవో  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.   టిటిడి బోర్డు, శ్రీవాణి ట్రస్ట్   తీర్మానాల ప్రకారం.. మొత్తం 6 పురాతన ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం నిధులను ఉపయోగించేందుకు ప్రభుత్వం  అనుమతి మంజూరు చేయడమే ఇందుకు కారణం. పురాతన ఆయయాల అభివృద్ధికి టీటీడీ నిధుల కేటాయింపునకు అనుమతి ఇస్తూ జారీ అయిన జీవో వివాదాస్పదం కావడానికి, పెను రాజకీయ చర్చకు దారి తీయడానికి కారణమేంటంటే..   ఈ  ఆరు ఆలయాల్లో  మూడు  తెలంగాణలోని ఆలయాలు కావడమే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన   శ్రీవాణి ట్రస్ట్ నిధులను తెలంగాణలోని దేవాలయాలకు ఎలా కేటాయిస్తారంటూ, పెద్ద ఎత్తున   విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక,   ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే..  పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ..  ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్,   వైసీసీ  ఈ అంశాన్ని  రాజకీయం చేస్తూ.. ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లేలా వ్యవమరిస్తున్నాది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం   పవన్ కళ్యాణ్ ఇ ఏపీ ప్రజల సొమ్మును తెలంగాణలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం, అక్కడ తమ పార్టీల బలోపేతం చేసుకోవడం కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నది. 

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని, తెలంగాణ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని తప్పుపడుతున్న వారూ.. విస్మరిస్తున్న కీలక అంశమేంటంటటే.. ట్రస్ట్ నిధులను తెలంగాణలో మూడు ఆలయాల అభివృద్ధికి వినియోగించడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందే కానీ, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా పొరుగురాష్ట్రానికి తరలించడంలేదు.  తిరుమల తిరుపతి దేవస్థానం సొంత నిధులను తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి వినియోగించడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటిది ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో. ఇక తిరుమలేశుడికి భక్తులు కానుకల ద్వారా సమర్పించుకున్న నిధుల వినియోగం విషయంలో  కూడా ప్రాంతీయ బేధాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు విమర్శలు చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి,  ప్రాంతీయ సరిహద్దులు, కుల, మతాల భేదాలు ఉండవు. తిరుమలేశునికి కానుకలు సమర్పించుకున్న వారిలో    తెలంగాణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఉంటూ స్వామివారి హుండీకి కోట్ల రూపాయల కానుకలు సమర్పిస్తున్నారు.  ఒక్క తెలుగురాష్ట్రాల నుంచి అని కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. కానుకలు సమర్పించుకుంటారు.  ఆ కానుకల ద్వారా వచ్చిన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం.. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో కూడా ఆలయాల నిర్మాణానికి, ఆధ్యాత్మిక ధర్మ ప్రచారానికీ వినియోగించడం ఎప్పటి నుంచో జరుగుతోంది.   ఇది పూర్తిగా ఒక ధార్మిక  కార్యక్రమం, దీనికి రాజకీయాలను, ప్రాంతీయతలను ఆపాదించడం ఇసుమంతైనా సరికాదు.  హిందూ ధర్మాన్ని రక్షణ, పురాతన ఆలయాల అభివృద్ధి విషయంలో టిటిడి, ఏపీ సర్కార్  తీసుకున్న  నిర్ణయాన్ని ప్రాంతీయ కోణంలో చూడటం తగదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.