Top Stories

political-news-img

ఇన్‌స్టా లవ్ ట్రాప్ కేటుగాడు కేసులో సంచలన విషయాలు..!

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన "రిచ్ కిడ్స్ ట్రాప్" ఘటన ఇంకా మరవకముందే, అదే తరహాలో సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వలలో వేసి మోసాలకు పాల్పడుతున్న మరో యువకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న ఈ యువకుడిని బంజారా హిల్స్ పోలీసులు చాకచ క్యంగా అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన పవన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే పవన్.. కేవలం మైనర్ బాలికలనే లక్ష్యంగా ఎంచుకుని వారికి ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. కొద్ది రోజుల పరిచయానికే ప్రేమిస్తు న్నానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి నమ్మకం సంపాదించేవాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానంటూ హామీలు ఇస్తూ వారి భావోద్వేగాలతో ఆడుకునేవాడు. చివరకు అత్యవసర అవసరాలు, కుటుంబ ఇబ్బందులు అంటూ నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారవడం అతని నేరశైలి...ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌కు చెందిన ఓ మైనర్ బాలిక కూడా పవన్ వలలో చిక్కుకుంది. ప్రేమ పేరుతో ఆమెనుపూర్తి గా నమ్మించి, బంగారు ఆభరణాలు తీసుకుని అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించ డంతో పవన్ పై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న పవన్ హైదరాబాద్‌ను విడిచి పరారయ్యాడు. దీంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పవన్ గురించి ఆరా తీయడంతో విస్తు పోయే విషయాలు వెలుగు లోకి వచ్చాయి. పవన్‌కు ఫిలింనగర్‌కు చెందిన త్రినాథ్ అనే స్నేహితుడు ఉన్నట్లు గుర్తించారు. గతంలో వీరిద్దరూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనం, మొబైల్ ఫోన్ చోరీ కేసు ల్లోనూ నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వెంటనే త్రినాథ్ ను విచారణ చేయడంతో జడ్చర్లలో మరో మైనర్ బాలికను వివాహం చేసుకున్న విషయం చెప్పాడు. త్రినాథ్ ఇన్‌స్టా గ్రామ్ ఖాతాను సాంకేతికంగా విశ్లేషించిన పోలీసులు పవన్ ఆచూకీని గుర్తించి జడ్చర్లలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరో మైనర్ బాలికను కూడా ఇదే తరహాలో మోసం చేసి వివాహం చేసుకున్నట్లు వెల్లడైంది. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటప డింది. పవన్ ఇప్పటికే 2025లో నమోదైన ఓ పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యాడు. అయినప్పటికీ తన నేరపూరిత ధోరణిని మార్చుకోకుండా మళ్లీ సోషల్ మీడియా వేదికగా మైనర్ బాలికలను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పవన్ వ్యవహారంలో ఇంకా ఎంతమంది మైనర్ బాలికలు బాధితులుగా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును విస్తరించారు. అతని మొబైల్ ఫోన్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లు, ఇతర సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.. సోషల్ మీడియా లో అపరిచితులతో పరిచయాలు పెంచుకునే విషయంలో యువతులు, ముఖ్యంగా మైనర్ బాలికలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Insta Love Trap, Rich Kids Trap, Karnataka State, Banjara Hills Police, Trinath, Hyderabad police, CP Sajjanar, DGP C.V Anand, CM Revanth redy

Publish Date: Jul 27, 2026 2:51PM

political-news-img

కాగల కార్యాన్ని బోండా ఉమ తీర్చేస్తున్నారుగా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి తీరు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా పడుతున్నాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో కేశినేని నాని, అంతకంటే ముందు కొడాలి నాని, వంశీ వంటి నేతల బాటలోనే బోండా ఉమ అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. గుంటూరులో జరిగిన ముద్రగడ సంస్మరణ సభ వేదికగా.. బోండా ఉమా చేసిన ప్రసంగం వైసీపీ స్వరం వినిపించేలా ఉంది. రాష్ట్ర జనాభాలో 25 శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో, ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో తగిన ప్రాధాన్యం లభించాలనీ, కాపుల ఆవేదనను, డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆలకించి, వారికి న్యాయమైన వాటా దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని బోండా చేసిన వ్యాఖ్యలు.. ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేవిగా ఉన్నాయి. బొండా ఉమానే స్వయంగా తమ పార్టీ ప్రభుత్వ తీరును ఎత్తిచూపేలా మాట్లాడటం వెనుక ఉన్న వ్యాహంపై చర్చోపచర్చలు మరొకవైపు, గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, పార్టీ సిద్ధాంతాలపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడిన అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, సన్నిహితంగా మెలగడం కూడా బోండా ఉమా రాజకీయ అడుగులు ఏ దిశగా పడుతున్నాయో తేటతెల్లం చేశాయంటున్నారు. తెలుగుదేశం అధినేతను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తితో వేదిక పంచుకోవడమే కాకుండా, ఆయనతో నవ్వుతూ ముచ్చటించడం ద్వారా బోండా ఉమా తీరుపై తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక పోత తెలుగుదేశం కేడర్ మాత్రం ఉమా పార్టీని వీడితేనే మేలని అభిప్రాయపడుతోంది. ఆయన పార్టీని వీడ వరకూ ఆగకుండా తెలుగుదేశం అధిష్టానమే ఆయనను బహిష్కరించాలని కూడా కోరుకుంటోంది. ఎందుకంటే.. ఉమా తెలుగుదేశం పార్టీని వీడితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చంద్రంగా ఇంత కాలంగా విజయవాడ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వంగవీటి రాధాకు మార్గం సుగమం అవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తున్నది. రాబోయే రోజుల్లో బోండా ఉమా తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమా నిజంగానే జెండా మారుస్తారా లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ నగర రాజకీయాల్లో బోండా ఉమా తీసుకునే నిర్ణయం కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికీ ఎంతో కీలకమైనదిగా మారనుంది. 2024 ఎన్నికలలోనే తెలుగుదశం పార్టీ వంగవీటి రాధాను మచిలీపట్నం ఎంపీ సీటు లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆఫర్ చేసింది. అయితే అప్పట్లో రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితేనే పోటీ చేస్తాననీ, లేకుంటే.. పోటీలో ఉండననీ స్పష్టం చేయడమే కాకుండా, పోటీ చేయకున్నా.. తెలుగుదేశం అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పి అదే పని చేశారు. అప్పట్లో.. విజయవాడ సెంట్రల్ నుంచి అంతకుముందు ఎన్నికలలో స్వల్ప తేడాతో పరాజయం పాలైన బోండా ఉమాను పక్కన పెట్టడం ఇష్టం లేక వంగవీటి రాధా కోరినట్లుగా ఆ నియోజకవర్గ టికెట్ వంగవీటి రాధాకు ఇవ్వలేదు చంద్రబాబు. ఇప్పుడు బోండా ఉమానే తన వ్యవహార శైలితో కాగల కార్యాన్ని స్వయంగా ఆయనే నెరవేరుస్తున్నారని తెలుగుదేశం వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బోండా ఉమా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరితే.. వంగవీటి రాధా వచ్చే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ, అదే జరిగితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అదే సమయంల వైసీపీలో బోండా ఉమా చేరిక ఆ పార్టీలో విభేదాలకు కారణమౌతుందనీ, విజయవాడలో ప్రస్తుతం వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్న దేవినేని అవినాశ్, ఇతర నేతలు నిస్సందేహంగా వ్యతిరేకిస్తారనీ చెబుతున్నారు. మొత్తం మీద బోండా ఉమ పార్టీ మారతరన్న వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పింపుతుంటే.. వైసీపీ శ్రేణుల్లో గుబులు మొతలైందని పరిశీలకులు విశ్లేషిస్టున్నారు. Bonda Uma, Ambati Rambabu, TDP Political News, Vijayawada olitics, YCP Rumors

Publish Date: Jul 27, 2026 2:19PM

political-news-img

ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా..!

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో ప్రతిపాదిత శ్రీరామ మందిర నిర్మాణానికి ఎదురైన చట్టపరమైన ఆటంకాలు తొలగిపోయాయి. ఈ ఆలయ నిర్మాణ పనులను కొనసాగించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం పూర్తి అనుమతిని మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. గతంలో జిల్లా యంత్రాంగం మరియు కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం (NOC) చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆధీనంలోని స్థలంలో ఆలయాన్ని నిర్మించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, అందులోని వాదనలను తోసిపుచ్చుతూ కేసును కొట్టివేసింది. ఈ వివాదానికి సంబంధించి పిటిషనర్లకు ఏవైనా ప్రత్యేక అభ్యంతరాలు లేదా సాంకేతిక అంశాలు ఉంటే, వారు చట్టపరిధిలో మరొక కొత్త పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉందని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ప్రస్తుత స్థితిలో నిర్మాణ పనులను నిలిపివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆకివీడు మండల కేంద్రంలో స్థానిక భక్తులు ఎంతో కాలంగా శ్రీరాముడి ఆలయాన్ని ఘనంగా నిర్మించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయి, జిల్లా కలెక్టర్ సైతం అన్ని అనుమతులతో ఎన్‌వోసీ జారీ చేయడంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. అయితే, ప్రభుత్వ స్థల దుర్వినియోగం జరుగుతోందంటూ కొందరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ ప్రాజెక్టుపై అనిశ్చితి నెలకొంది. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ఆ వివాదాలన్నింటికీ తెరపడినట్లయింది. ఈ తీర్పుపై ఆకివీడు ప్రజలతో పాటు ఆలయ నిర్మాణ కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో స్థానిక ఆధ్యాత్మిక వేత్తలు మరియు భక్తులలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అత్యున్నత న్యాయస్థానం క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో, రామాలయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు. స్థానిక యంత్రాంగం సహకారంతో త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రతిష్ఠాపనా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భక్తులు కోరుకుంటున్నారు. Akiveedu Ram Temple, Supreme Court verdict, West Godavari district, Collector NOC, AP News, CM Chandrababu, Naralokesh, Raghu Rama Krishna Raju

Publish Date: Jul 27, 2026 2:16PM

political-news-img

నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో రగడ..!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది. నీట్ అక్రమాలపై తక్షణమే సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో చేపట్టిన ఆందోళనలతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సోమవారం జులై 27వ తేదీన ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు నీట్ వివాదంపై చర్చకు పట్టుబట్టారు. దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు, పరీక్షా కేంద్రాలలో వెలుగుచూసిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు సాధారణ విద్యార్థుల కష్టాన్ని నీరుగారుస్తున్నాయని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నినాదాలు, పోడియం వద్దకు దూసుకెళ్లిన వాతావరణంతో లోక్‌సభ మరియు రాజ్యసభలు రెండూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఈ ఆందోళనకు ప్రధాన కారణం కేవలం పార్లమెంట్ లోపల చర్చ జరపకపోవడమే కాకుండా, బయట విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు కూడా ప్రధానాంశంగా మారాయి. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా దేశ రాజధానిలో విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' కార్యక్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. విద్యార్థుల నిరసనను అణచివేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడం, కన్నీటి వాయు గోళాలు (టియర్ గ్యాస్) ప్రయోగించడం మరియు పెల్లెట్ గన్స్ ఉపయోగించడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు దమనకాండపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ సభల్లో విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. సభలో చోటుచేసుకున్న ఈ గందరగోళంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ నడవకుండా నినాదాలు చేయడం సమంజసం కాదని ఆయన సభ్యులకు స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన తర్వాత అన్ని ముఖ్యాంశాలపై విస్తృత చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి అంశంపైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని, ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్ష ఎంపీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సభ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనలు కొనసాగించే సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ, విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా నినాదాలు హోరెత్తించడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేయక తప్పలేదు. అటు రాజ్యసభలోనూ సరిగ్గా ఇదే పరిస్థితి పునరావృతమయ్యాయి. నీట్ లీకేజీతో పాటు విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. రాజ్యసభ ఛైర్మన్ ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వాతావరణం శాంతించలేదు. విపక్షాల నిరసనల హోరు మధ్య సభ నిర్వహణ అసాధ్యంగా మారడంతో రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఏళ్ల తరబడి కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు లీకేజీల వల్ల అంధకారంలోకి నెట్టబడుతోందని ప్రతిపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. NEET Paper Leak Controversy, Parliament Adjourned, Om Birla Speaker, NEET Protests Lathi Charge, Lok Sabha News Telugu, NEET UG Exam Scandal

Publish Date: Jul 27, 2026 1:05PM

political-news-img

నీట్ విద్యార్థులపై లాఠీచార్జ్.. పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..!

నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..! పేపర్ లీకేజీల రాక్షస క్రీడలో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న అభ్యర్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్వీకరించాల్సిన తీరు ఇది కాదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీలు, కురిపించిన టియర్ గ్యాస్ షెల్స్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజధాని వీధుల్లో న్యాయం కోసం నిరసన తెలిపిన అభ్యర్థులపై పోలీసుల బలప్రయోగం సరైనది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అణచివేయడం ఏమాత్రం తగదని దేశ అత్యున్నత ప్రాంగణం పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. గత జూలై 20వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా 'సంసద్ చలో' పేరిట వేలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు బృందాలుగా ఏర్పడి మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్న నీట్ పేపర్ లీక్ కేసులో తక్షణమే పారదర్శకమైన రీతిలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్యాయానికి గురైన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. అయితే, శాంతియుతంగా సాగుతున్న ఆ నిరసన ప్రదర్శనను అడ్డుకునే క్రమంలో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా విరుచుకుపడింది. విద్యార్థులపై నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు విచక్షణారహితంగా టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటమే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించిన విద్యార్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు, బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై స్వతంత్ర సంస్థతో సమగ్రమైన విచారణ జరిపించాలని, అలాగే అక్రమంగా ప్రవర్తించిన బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మరియు మార్గదర్శకమైన వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి శాంతియుతంగా తన నిరసనను వ్యక్తం చేసే ప్రాథమిక హక్కును స్పష్టంగా కల్పించిందని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. కేవలం నిరసన తెలుపుతున్నారు అనే ఒంటెద్దు పోకడ కారణంతో పౌరులపై లేదా విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కోర్టు ఖచ్చితంగా తేల్చిచెప్పింది. శాంతియుత మార్గంలో సాగే పోరాటాలు ప్రజాస్వామ్యానికి జీవకర్ర లాంటివని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, విద్యార్థులు తమ ఆవేదనలను, హక్కుల పోరాటాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు అత్యంత ప్రధానమైన సాధనాలని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిధిలోనే విద్యార్థులు జూలై 20న సంసద్ చలో కార్యక్రమాన్ని నిర్వహించారని, అటువంటి సమయంలో చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు యంత్రాంగం రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మరిచిపోకూడదని న్యాయస్థానం ఉద్ఘాటించింది. విద్యార్థుల నిరసనలపై జరిగిన ఈ దమనకాండపై స్వతంత్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న పిటిషనర్ల వాదనలను పరిశీలిస్తూనే, భవిష్యత్తులో దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు పరిమితులను పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ చారిత్రాత్మక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకంలో కొత్త ఆశలను చిగురింపజేయడమే కాక, పౌర హక్కుల పరిరక్షణపై ఒక సరికొత్త చర్చకు దారితీశాయి. NEET Protest Lathi Charge, Supreme Court on NEET, Sansad Chalo Protest, Supreme Court Hearing, Student Rights India, NEET Paper Leak Controversy

Publish Date: Jul 27, 2026 12:40PM

political-news-img

ఆడపిల్ల పుడుతుందనే.. బలవంతపు అబార్షన్.. తల్లీబిడ్డల ప్రాణాలు బలి..!

తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం... కన్న కూతురి ప్రాణాన్నే బలితీసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది."గర్భంలో పెరుగుతున్న శిశువు... ఆడపిల్ల అని తెలిసింది. ఆ క్షణం నుంచి ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట్లో... అమానుష నిర్ణయం తీసుకున్నారు. కూతురు, అల్లుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. "ఆడపిల్ల వద్దు" అనే ఆలోచన... చివరకు ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది. అక్రమంగా నిర్వహించిన గర్భస్రావం వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాల కోసం పోరాడిన శ్రావణి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంకా ఈ లోకాన్ని చూడని పసికందు కూడా... తల్లి ఒడిని చేరకముందే శాశ్వతంగా దూరమైంది. ఒక ఆడబిడ్డ పుట్టకూడదనే నిర్ణయం... చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఒకటి గర్భంలోని చిన్నారి... మరొకటి ఆ చిన్నారికి జన్మనివ్వాల్సిన తల్లి. ఆడపిల్ల పుడుతుందనే కారణంతో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం చివరకు కన్నకూతురి ప్రాణాలనే బలితీసుకుంది. కూతురు, అల్లుడి ఇష్టాన్ని ఏమాత్రంపట్టించుకోకుండా గర్భంలో ఆడ శిశువు ఉందని తెలుసుకున్న తల్లి, బలవంతంగా గర్భస్రావం చేయించింది. అక్రమంగా నిర్వహించిన ఈ అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావానికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన జనగామ జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం మృతురాలు శ్రావణి గర్భవతిగా ఉండగా స్కానింగ్ ద్వారా గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లుగా తల్లి శోభ తెలుసుకున్నారు. అనంతరం కూతురు, అల్లుడి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా మృతురాలి తల్లి శోభ, జనగామలో ఏఎన్‌ఎంగా (ANM) పనిచేస్తున్న అనసూయ సహకారంతో ఈ నెల 21న ఆమె ఇంట్లో నే అక్రమంగా అబార్షన్ చేయించింది.అబార్షన్ అనంతరం 22వ తేదీ రాత్రి శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది. తొలుత జనగామలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణిం చింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 25న శ్రావణి మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతురాలి భర్త భాస్కర్ జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఆర్‌ఎంపీ శ్రవణ్, స్కానింగ్ నిర్వహించిన ప్రవీణ్, ఏఎన్‌ఎం అనసూయ, మృతురాలి తల్లి శోభపై కేసులు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 125, 89, 49తో పాటు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) Act సెక్షన్లు 5, 5(3), 5(4), అలాగే ఫ్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) Act సెక్షన్ 23 కింద కేసులు నమోదు చేశారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ ఎలా జరిగింది? అక్రమ అబార్షన్‌కు ఎవరు సహకరించారు? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు Forced Abortion, Female Foeticide, Sex-Selective Abortion, Gender Discrimination, Janagama district, Shravani, baby girl, Crime News, Shocking Incident, Medical Negligence, PCPNDT Act, MTP Act, BNS Case

Publish Date: Jul 27, 2026 11:40AM

MOVIE NEWS