వైసీపీలో బొత్స సినిమా అయిపోయిందా?

Publish Date:Jul 6, 2026

Advertisement

వైసీపీలో బొత్సకు ప్రాధాన్యత తగ్గిపోయిందా?  ఆ పార్టీ అధినేత జగన్.. బొత్సను పక్కన పెట్టేశారా? త్వరలో ఆయనకు శాసనమండలిలో ప్రతిపక్ష నేతా హోదా నుంచి ఉద్వాసన చెప్పేస్తారా? అన్న ప్రశ్నలకు వైసీపీ వర్గాల నుంచే ఔనన్న సమాధానం వస్తోంది. ఇందుకు వారు పార్టీ పరంగా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదన్న విషయాన్ని రుజువుగా చూపుతున్నారు. ఇటీవల తరచుగా బొత్స అనారోగ్యానికి గురి కావడం వల్లనే జగన్ ఆయనకు విశ్రాంతి ఇవ్వాలనీ, పెద్దగా ఒత్తడి ఉండకూడదన్న ఉద్దేశంతోనే మండలిలో ప్రతిపక్ష నేత హోదానుంచి తప్పించాలని భావిస్తున్నారనీ అంటున్నారు.

అయితే పరిశీలకులు మాత్రం.. ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు.  ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.  

ఇక అసలు విషయానికి వస్తే..బొత్సను జగన్ పక్కన పెట్టడానికి ప్రధాన కారణం, ఆయన గతంలోలా యాక్టివ్ గా లేకపోవడం అంటున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఆయన జగన్ తో పెద్దగా భేటీ అయినట్లు కనిపించకపోవడాన్ని చెబుతున్నారు.  అన్నిటికీ మించి బొత్సకు రాజకీయంగా గతంలో ఉన్న పట్టు సడలిందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటన్నిటికీ మించి విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయం స్థలం విషయంలో ఇటీవల తలెత్తిన వివాదం బొత్సకు ఉద్వాసన పలకాలన్న నిర్ణయానికి జగన్ రావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.  

పూసపాటి రాజవంశీయుల  భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగింది. దీనిపై గోవాగవర్నర్ అశోక్ గజపతిరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అది ప్రైవేటు భూమి అని తేలితే..  కార్యాలయ భవనాన్ని వైసీపీ వదులుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వైసీపీ ఇమేజి భారీగా డ్యామేజ్ అవుతుంది. ఈ  విషయంలోనే జగన్ బొత్సపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనీ, అప్పట్లో  మంత్రి స్థానంలో ఉన్న బొత్స నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడీ వివాదం తలెత్తిందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.   

Botsa, sidelined, YCP, Ysjagan, Vijayanagaram, YCP Office, Land Dispute, Inactive

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.