క‌విత‌క్క వెంక‌న్న‌ను....ఏం మొక్కిందంటే?

Publish Date:Oct 19, 2025

Advertisement

 

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం చేస్కున్నారు తెలంగాణ జాగృతి నాయ‌కురాలు క‌విత‌. అక్టోబ‌ర్ 21 నుంచి తాను చేయ‌బోతున్న తెలంగాణ జాగృతి యాత్ర దిగ్విజ‌యం కావాల‌ని వెంక‌న్న‌ను మొక్కుకున్నారు క‌విత‌.

ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ యాత్ర ఎంతో ప్ర‌త్యేకంగా చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం బావ మాత్ర‌మే త‌నకు ద్రోహం చేశార‌ని చెప్పుకున్న క‌విత‌.. త‌న తండ్రి ఫోటో కూడా లేకుండా కేవ‌లం ప్రొ. జ‌య‌శంక‌ర్ ఫోటోతో మాత్ర‌మే.. ఈ యాత్ర చేయ‌బోతున్నారు.

భార‌త రాష్ట్ర స‌మితి అన్న పేరు పెట్ట‌డంతో తెలంగాణ శ‌బ్దం కోల్పోయిందీ కేసీఆర్ పార్టీ. దీంతో త‌న అధికారం సైతం కోల్పోవ‌ల్సి వ‌చ్చిందా పార్టీ. దీంతో తిరిగి తెలంగాణ సెంటిమెంటు ర‌గిల్చేందుకు  తెలంగాణ జాగృతిని బ‌య‌ట‌కు తీశారు క‌విత‌. అప్ప‌టి వ‌ర‌కూ స్త‌బ్ధుగా ఉన్న జాగృతి ఉన్న‌ట్టుండి ఉధృత‌మ‌య్యింది. కార్య‌క‌లాపాల వేగం పెంచింది. ఆ మాట‌కొస్తే పార్టీ పెట్ట‌కుండానే రెండుగా చీలింది కూడా.

ఈ మొత్తం వ్య‌వ‌హారానికి ముందు.. ఒక‌ క్ర‌మ ప‌ద్ద‌తి ప్ర‌కారం తండ్రి పార్టీ బీఆర్ఎస్ నుంచి వేరుప‌డి.. ఇప్పుడు కొత్త పార్టీ దిశ‌గా అడుగులు వేస్తున్నారు క‌విత‌. అందులో భాగంగా తొలుత తెలంగాణ జాగృతి పేరిట రాష్ట్ర‌ వ్యాప్తంగా యాత్ర‌ల‌కు తెర‌లేపారు. ఈ యాత్ర‌ల ద్వారా తిరిగి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రై వారి ఆశీర్వాద బ‌లంతో పార్టీ పెట్టాల‌న్న‌ది క‌విత‌క్క‌ టార్గెట్ గా తెలుస్తోంది. ఇవ‌న్నీ స‌జావుగా న‌డ‌వాల‌నే వెంక‌న్న‌ను మొక్కిన‌ట్టు తెలుస్తోంది.

2028ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డంలో భాగంగా క‌విత ఈ అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే క‌విత చీల్చ‌బోయే  ఓట్లు ఎవ‌రివ‌వుతాయి? ఒక వేళ ఓట్ల చీలిక తెస్తే ఎవ‌రికి లాభం- న‌ష్టం??? అన్న అంచ‌నాలు అటుంచితే.. మొత్తం మీద అయితే రాజ‌కీయంగా త‌న సొంత కాళ్ల‌పై నిలిచేందుకు క‌విత చేసే య‌త్నంలో ఇది కీల‌క అడుగు కాబోతుంద‌ని అంతా భావిస్తున్నారు

By
en-us Political News

  
సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ, మట్టి వాసనపై ఉన్న మక్కువతో ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేశాడు.
భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక సంచలన వివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మండిపోతున్న ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.
తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం మరో సారి విచారణకు హాజరయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.