జీవించడమంటే ఇదే..!

Publish Date:May 27, 2024

Advertisement

జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు. 

ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు.

మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి,  నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.

 ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు  జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.

 నేర్చుకుంటున్న విద్య  కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం...  జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.

                                     ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.