ఎవరైనా తీయని మాటలతో మోసం చేస్తున్నారా లేదా? ఇదిగో ఇలా తెలుసుకోండి!

Publish Date:Jul 4, 2026

Advertisement

చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే..

ప్రసంశలు..

ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది.

తప్పు ఒకరిది, అవమానం మరొకరిది..

తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు.

తమని తాము అనుమానించుకునేలా..

"నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి.

అయ్యో పాపం అనుకునేలా చేయడం..

పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు.

ఇష్టమైన వారి నుండి వేరు చేయడం..

మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు.

అవసరం..

అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు .

తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
సాయంత్రం పూట వేడి వేడిగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ కోసం సింపుల్ టిప్స్.
మధుమేహం మరియు ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఊరటనిస్తూ, మందులు లేకుండానే రక్తంలోని చక్కెరను నియంత్రించే సూక్ష్మ ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ గురించి తెలుసుకోండి. స్విస్ పరిశోధకుల ఈ సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీ విశేషాలు.
గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులలో ఆరోగ్యానికి ఏది మంచిది? బరువు నియంత్రణ, డయాబెటిస్, ఎముకల బలం కోసం ఏ రొట్టె ఉత్తమమో పూర్తి పోషక విశ్లేషణ తెలుసుకోండి.
మార్కెట్ నుంచి ఎండిన బిర్యానీ ఆకులు కొనడం ఆపేయండి! కేవలం రూ.200 పెట్టుబడితో మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పైనే గుమగుమలాడే బిర్యానీ ఆకు మొక్కను ఎలా సులభంగా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారపు అలవాట్లు, నీరు త్రాగే విధానం, వ్యాయామం మరియు నిద్రకు సంబంధించిన ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
నిద్రలేమి సమస్యను తగ్గించే పోషకాలు, పిప్పి పన్ను నొప్పికి తేనెతో ఇంటి చిట్కాలు మరియు 70% పచ్చి ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఫ్రాన్స్‌లో తొలిసారిగా మనిషికి సోకిన ప్రాణాంతక షమోండా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.