అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా.!

Publish Date:Oct 10, 2026

Advertisement

 అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా.!

ఏదైనా ఒక అందమైన బంధానికి అతి ముఖ్యమైన పునాది ప్రేమ , పరస్పర నమ్మకం. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను పంచుకునేటప్పుడు ఆ బంధంలో నమ్మకమే ప్రధాన ఊపిరిగా పనిచేస్తుంది. అయితే అదే నమ్మకం స్థానంలో చిన్నగా అనుమానం ప్రవేశిస్తే ఎంతటి బలమైన బంధమైనా క్రమంగా విచ్ఛిన్నం కావడానికి ఎంతో సమయం పట్టదు. భాగస్వామి ప్రతి చిన్న కదలికను తప్పుగా అర్థం చేసుకోవడం, ప్రతి విషయానికి భయపడటం , మనస్సులోనే ఎప్పుడూ  ఆలోచిస్తూ ఉండటం బంధంలో మానసిక దూరాన్ని పెంచుతాయి. అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో , దానిని ఎలా అధిగమించవచ్చో  వివరంగా తెలుసుకుంటే..

ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం..

భాగస్వామి ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఉన్నారు, ఎందుకు ఆలస్యమైంది అని సాధారణంగా అడిగే ప్రశ్నలు,  ఇవి ప్రేమకు సంకేతం కావచ్చు. కానీ అదే పనిగా ప్రతి నిమిషం వివరాలు అడుగుతూ, వారి సమాధానాలను తప్పు పడుతుంటే అది భద్రతాభావం లోపించడానికే సూచిక. భాగస్వామిని నిరంతరం ప్రశ్నించడం వల్ల వారికి తమ స్వతంత్రతను కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. ఇది వారిలో తీవ్రమైన ఒత్తిడిని, అసహనాన్ని నింపుతుంది.

ప్రైవసీకి భంగం కలిగించడం..

ఒకరి ఫోన్‌ను దొంగతనంగా చూడటం, మెసేజ్‌లు , కాల్ హిస్టరీ చెక్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్స్ పై  నిరంతరం నిఘా పెట్టడం వంటి పనులు బంధంలో వ్యక్తిగత లిమిట్స్ ను దాటడమే అవుతాయి. నమ్మకాన్ని పెంచడానికి ఇలాంటి పనులు ఎంతమాత్రం ఉపయోగపడవు. పైగా ఇవి భాగస్వామికి తమపై అసలు గౌరవం లేదనే భావనను కలిగిస్తాయి.

ఆధారాలు లేకుండా నిందలు వేయడం..

భాగస్వామి ఏదైనా పనిలో బిజీగా ఉండి ఫోన్ తీయనప్పుడు లేదా మెసేజ్‌కు ఆలస్యంగా రిప్లై ఇచ్చినప్పుడు, పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేరుగా ఏదో తప్పు జరుగుతోందని నిర్ణయానికి రావడం చాలా ప్రమాదకరం. ఆధారాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా నిందలు వేయడం వల్ల భాగస్వామి తీవ్ర మనస్తాపానికి గురవుతారు. విషయాలను సూటిగా అడిగి తెలుసుకోవడానికి బదులు ఊహించుకోవడం వల్ల లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.

బంధంలో మానసిక దూరం పెరగడం..

నిరంతరం అనుమానాలు, నిందలు ఎదుర్కొనే భాగస్వామి మానసికంగా అలసిపోతారు. తమను ప్రతి విషయంలోనూ తప్పుగా భావిస్తున్నారని అనిపించినప్పుడు వారు క్రమంగా మాట్లాడటం తగ్గించేస్తారు. మరోవైపు అనుమానించే వ్యక్తి కూడా నిరంతరం ఆందోళన, భయంతో గడుపుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ, ఆత్మీయత తగ్గిపోయి మానసిక దూరం చాలా వేగంగా పెరుగుతుంది.

అనుమానానికి అసలు కారణాలు..

అనుమానించే అలవాటు ఎప్పుడూ భాగస్వామి చేసే తప్పుల వల్లే రావాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న చేదు అనుభవాలు, చిన్నతనంలో ఎదురైన మానసిక సంఘటనలు, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా భాగస్వామిని ఎక్కడ కోల్పోతామోననే భయం కూడా వ్యక్తిని ఎక్కువగా అనుమానించేలా చేస్తాయి. ముందుగా ఈ భయాలకు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.

బంధాన్ని కాపాడుకోవడానికి మార్గాలు..

ముందుగా  మనస్సులో కలిగే అనుమానాలు నిజమైన సంఘటనల ఆధారంగా వస్తున్నాయా లేదా కేవలం  భయాల వల్ల వస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. భాగస్వామిపై నిందలు వేసే విధంగా కాకుండా మీ భయాలు, ఆందోళనల గురించి వారితో ప్రశాంతంగా, ఓపేన్ గా  మాట్లాడాలి. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలి. అనుమానాలు మరీ ఎక్కువై బంధం చేజారిపోతోందని అనిపిస్తే దంపతులు మంచి కౌన్సెలర్ లేదా మానసిక నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది.


                                *రూపశ్రీ.

By
en-us Political News

  
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
సాయంత్రం పూట వేడి వేడిగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ కోసం సింపుల్ టిప్స్.
మధుమేహం మరియు ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఊరటనిస్తూ, మందులు లేకుండానే రక్తంలోని చక్కెరను నియంత్రించే సూక్ష్మ ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ గురించి తెలుసుకోండి. స్విస్ పరిశోధకుల ఈ సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీ విశేషాలు.
గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులలో ఆరోగ్యానికి ఏది మంచిది? బరువు నియంత్రణ, డయాబెటిస్, ఎముకల బలం కోసం ఏ రొట్టె ఉత్తమమో పూర్తి పోషక విశ్లేషణ తెలుసుకోండి.
మార్కెట్ నుంచి ఎండిన బిర్యానీ ఆకులు కొనడం ఆపేయండి! కేవలం రూ.200 పెట్టుబడితో మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పైనే గుమగుమలాడే బిర్యానీ ఆకు మొక్కను ఎలా సులభంగా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారపు అలవాట్లు, నీరు త్రాగే విధానం, వ్యాయామం మరియు నిద్రకు సంబంధించిన ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
నిద్రలేమి సమస్యను తగ్గించే పోషకాలు, పిప్పి పన్ను నొప్పికి తేనెతో ఇంటి చిట్కాలు మరియు 70% పచ్చి ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఫ్రాన్స్‌లో తొలిసారిగా మనిషికి సోకిన ప్రాణాంతక షమోండా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.