మనసు విరిగి స్వగృహానికి థాక్రే!
Publish Date:Jun 23, 2022
Advertisement
కలిసి కాపురం చేయాలనుకున్నవారు ఒక్కసారిగా చెడు మాటలు వినో, అర్ధంలేని అపర్ధాల వల్లనో మన స్పర్ధలు కొనితెచ్చుకుని విడిపోవడం దురదృష్టకరం. అందరూ ఏక తాటి మీద నిలిచి పాలన సాగిద్దా మనుకున్నవారిలో విభేదాలు పొడచూపితే సమస్యలు అఘాతానికి దారితీస్తాయి. వారిలో ఒక రికి పాలనా విధా నాలో, మరే కారణంచేతనో నచ్చకపోతే మరో ఇద్దరిని గిల్లి నాయకునితో గిల్లి కజ్జాలకు దిగి దూరం కావడం ఈ రోజుల్లో బాగానే సాగుతోంది. సదరు మంత్రో ఎమ్మల్యేనో మరో అయిదు, పదిమందిని తన వేపు లాక్కు ని అమాంతం ఏ హోటల్లోనో, విల్లాలోనో కబుర్లాడుకుంటూ నాయకునికి నిద్ర లేకుండా చేయడం పరిపాటిగా మారింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం దాదాపు ఇలానే వుంది. అక్కడ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ పతనం ఖాయనమన్నది మరింత స్పష్టమయింది. అయినా విభేదాలు వచ్చినంత మాత్రాన మనలో మనం మాట్లాడుకోవడం కంటే విడిపోవడంలో అర్ధం లేదని, విపక్షాలకు పనిట్టుకుని మంచి అవకాశం ఇచ్చినట్టే అవుతుందని మహా సిఎం ఉద్ధవ్ థాక్రే తెగ బాధపడిపోతున్నాడు. తను నచ్చకున్నా, తన పాలనా సామర్ధ్యాన్ని అంగీకరించకున్నా చాలా ఫ్రెండ్లీ గానే ఎదురుపడి చెప్పకుండా ఇంట్లోవాళ్లందరినీ పిక్నిక్ కి తీసికెళ్లినట్టు ఎమ్మెల్యేలను అలా దూరం చేసి కూటమిలా ఏర్పడి తిరుగుబాటు ప్రకటించడం దేనికని థాక్రే మనసులో మాట బయటపెట్టారు. అసలు తనను పార్టీ అధ్యక్షపదవికి, సీఎం పదవికి అన్హర్హుడిని అని భావించినపుడు నేరుగా చెప్పి వుంటే రాజీ నామా చేసి ఇవతలకు వచ్చేవాడినని థాక్రే అనడం ఆయనకు తన భవిష్యత్తు క్లియర్ కట్ గా తెలిసిపోయిందని అర్ధం. చేతిలో రాజీ నామా లేఖ పట్టుకుని పట్టుకుని గేట్లోనే నిలబడి సి.ఎం పట్ల ఇంకా తిరుగుబాటు బృందం దూరంగా వుండ డంలో అర్ధంలేదు. శివసేన నాయకుడు థాక్రే తనకు జరిగిన అన్యాయం పట్ల తెగ బాధపడిపోతున్నారు. బాల్ థాక్రే కుమా రుడిని, హిందూత్వాన్ని వీడతానని ఎన్నడూ అనుకోవద్దని, తాను ఎలాంటి పదవులకూ ఎన్నడూ పాకు లాడలేదని తస్మదీయులకు వినిపించేలా చెప్పేరు. చిత్రమేమంటే ఏక్‌నాథ్ షిండేతో వున్న 34 మంది ఎమ్మెల్యేలూ సరదాగా, నిజంగా ఆయన పట్ల అభిమానంతో వెళ్ల లేదట. వారంతా బలవంతంగానే షిండే వెనక వెళ్లామని థాక్రేతో అన్నారట! ఇప్పుడు తన పాలనను వ్యతిరేకించినవారు, తన బలాన్ని దెబ్బ తీసినవారికి వారి పని ఎంత అసంమజసమన్నది త్వరలో తెలుసుకుంటారని థాక్రే వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ఇచ్చిన సందేశంలో చూచాయిగా వ్యక్తం చేశారు. థాక్రే మాత్రం మనసు విరిగి అధికార నివాసం వదిలి స్వగృహానికి వెళ్లారు. ఆయన ఇంకా అధికారికంగా తన పదవికి రాజీనామా చేయలేదు. మరి ఈ పరిస్థితుల్లో షిండే తన వెంట వచ్చిన వారితో అధికార పీఠాన్ని ఎక్కడానికి ఏ మంత్రతంత్రాలు పారిస్తారో చూడాలి.
http://www.teluguone.com/news/content/thakrey-vacates-official-residence-25-138245.html





