జగన్ దెబ్బ.. కాకినాడ ఐడియల్ కాలేజీ మూత!
Publish Date:Jun 23, 2022
Advertisement
చాలా కాలం విద్యార్ధులు, తల్లి దండ్రులకు విద్యా భరోసా ఇచ్చిన కాలేజీ. చాలాకాలం ఎంతోమంది మెరిక ల్లాంటి విద్యార్ధులను విశ్వవిద్యాలయాలకు అందించిన కాలేజీ మూత పడుతుందని ఎవరన్నా అనుకుం టారా? ఇది వూహకు అందనిది. కాకినాడ పట్టణంలో గత 52 ఏళ్లుగా అద్బుతంగా నడిచిన కాలేజీ గేట్లు జులై ఒకటో తేదీన శాశ్వతంగా మూతపడుతున్నాయి. ఇది ఆ కాలేజీ విద్యార్దులకు, పూర్వ విద్యార్ధులకు, కాకినాడ ప్రజలకు మనసు కలచి వేసే వార్తే. కానీ ఈ దారుణానికి కారణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, తీసుకున్న నిర్ణయాలే. జగన్ పాలనలో విద్యారంగ పరిస్థితి దిగజారిపోయిందని అనడానికి తాజా వుదాహరణ కాకి నాడలోని ఐడియల్ కాలేజీ మూసివేత. రాష్ట్రంలో అంతగా నడవని కాలేజీలను మూసేయడమే ఉత్తమమని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించడం కంటే దారుణం మరోటి వుండదు. విద్యా సంస్థలకు, విద్యార్దుల భవితకు వెన్నుదన్నుగా వుంటామని, విద్యారంగాన్ని ఎంతో మెరుగుపరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే హుళక్కేనా! అనేకానేక కారణాలవల్ల ఆర్ధిక మద్దతు లేక అతి కష్టంగా నడుస్తున్న కాలేజీలకు ప్రభుత్వం మద్దతునివ్వాలి. వాటిని, వాటిని నమ్మకున్న విద్యార్ధులు, వుద్యోగులకు భరోసా ఇవ్వాలి. కానీ జగన్ ప్రభుత్వం అలాంటిదేమీ చేయలేదు. అసలు రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి సంబంధించిన అనుసరిస్తున్న విధానాలు కాలేజీలకు నష్ట దాయ కమే అవుతున్నాయని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కాలేజీ యాజమాన్యాలు గోడు పెడుతున్నాయి. విద్యార్థులు ఆందోళనలకు దిగారు. చాలా కాలం నుంచి వున్న కాలేజీల ఆర్ధిక పరిస్థితి గురించిన అధ్యయనమే చేపట్టకుండా కాలేజీలకు ఇవ్వా ల్సిన గ్రాంట్లను నిలిపివేయడమేమటనే ప్రశ్న దాదాపు అన్ని ప్రాంతాల్లోని కాలేజీల యాజమా న్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే విధంగా ఒంటెద్దు పోకడ పోతే రాష్ట్రంలో కాలేజీలు నడిచే పరిస్థితి వుంటుందా? ఇదే ఆగ్రహం కాకినాడ ఐడీయల్ కాలేజి కరస్పాండెంట్ చిరంజీవినీ కుమారి కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానంతో విద్యా సంస్థలు నష్టపోతున్నా యని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల ఆర్థిక పరిస్థితి అధ్యయనం చేయకుండా.. ఏపీ ప్రభుత్వం గ్రాంటు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసులోని ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వం బదిలీ చేయడంపై మండిపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-policies-led-to-the-clousure-of-kakinada-ideal-college-25-138247.html





