ఆర్జీవీ అంటే రోత గోపాల వర్మ.. ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు
Publish Date:Jun 23, 2022
Advertisement
సంచలనాలు ఆయనను వెతుక్కుంటూ వస్తాయో.. ఆయనే సంచలనాల వెంట పడతారేమో కానీ రాంగోపాల్ వర్మ నోరు తెరిచి ఓ మాట అంటే సంచలనం. ట్వీట్ చేస్తే వివాదం..ఇలా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు రామగోపాలవర్మ అలియాస్ ఆర్జీవీ. ఇప్పుడు ఆయన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మును టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు . ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ముర్ము చాలా పేద కుటుంబంలో పుట్టిన మనిషి. తన పాతికేళ్ల కెరీర్ లో రాజకీయాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచే వరకూ ఎదిగారు. ఆదివాసీ మహిళ అయినప్పటికీ ఆమె ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. అందులో సందేహం లేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము జూన్ 25 న నామినేషన్ వేయనున్నారు. ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికైన మొదటి ఆదివాసీ గిరిజన మహిళగా ఈమె చరిత్ర సృష్టిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లను బట్టి రాష్ట్రపతిగా ఆమె ఎన్నిక లాంఛనమే. అటువంటి మహిళపై రామ్ గోపాల్ వర్మ నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. ఎంతైనా గర్హనీయం. పురాణ గాధలోని ఓ పేరును తీసుకుని ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడటం శిక్షార్హం కూడా. పైగా గిరిజన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామగోపాల వర్మపై ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మహిళను గౌరవించడం మన సమాజ ధర్మం. గౌరవించడానికి పేరు, స్థాయితోనూ సంబంధం లేదు. రామగోపాల వర్మ ద్రౌపది ముర్మును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఆర్జీవీ నీచ మనస్థత్వానికి, సంకుచిత ఆలోచనా ధోరణికీ నిదర్వనం. జీవితంలో ఎంతో కష్టపడి దేశంలో ఉన్నత స్థాయికి చేరుకున్న మహిళను ఎకసెక్కం చేయడం.. ఆమె పేరును బట్టి వ్యక్తిత్త హననానికి పాల్పడటం దుర్మార్గం. దారుణం.
http://www.teluguone.com/news/content/rgv-ugly-comments-on-draupati-murmu-25-138242.html





