సిడ్నీలో ఉగ్రఘాతుకం.. నిందితులు పాక్ కు చెందిన తండ్రీకొడుకులు

Publish Date:Dec 15, 2025

Advertisement

అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ లో జరిగిన నరమేథం ఉగ్రదాడేనని తేలింది. ఐసీస్ తో సంబంధాలున్న పాక్ జాతీయులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.  యూదులు లక్ష్యం వారు హనూకా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాకిస్థాన్ జాతీయులైన తండ్రీ కొడుకులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తేలింది. కాల్పులకు తెగబడ్డవారిని   నవీద్ అక్రమ్, అతడి తండ్రి సాజిద్ అక్రమ్ గా రక్షణ బలగాలు గుర్తించాయి.

వీరిరువురూ పాక్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించాయి. భద్రతాదళాల కాల్పుల్లో నవీద్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఓ హంటింగ్ క్లబ్‌లో సభ్యుడైన అతడి తండ్రి సాజిద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. సాజిద్ పేరిట 2015 నుంచి గన్ లైసెన్స్ ఉందని తేలింది. సాజిద్ వద్ద ఉన్న ఆరు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ఈ తండ్రీకొడుకులు జరిపిన దాడిలో16 మంది మరణించగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. 
ఇలా ఉండగా నిందితుల్లో ఒకరు చాలా కాలంగా ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘాలో ఉన్నట్లు చెబుతున్నారు.  కాల్పుల ఘటన తరువాత జరిపిన సోదాలలో వీరి కారులో  ఐసీస్ నల్లజెండాలు లభ్యమయ్యాయి. కాగా వీరిని ఓ సామాన్యుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. ఆ క్రమంలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి నిందితులను అడ్డుకున్న వ్యక్తిని 43 ఏళ్ల అహ్మద్ గా గుర్తించారు,  ప్రాణాలకు తెగించి మరీ నిందితుడితో పోరాడిన అహ్మద్‌ రియల్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 

ఇక పోతే   కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరూ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నా వారి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.  విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం డిసెంబర్ 14) రాత్రి వారి నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా  నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని తేలింది.  

By
en-us Political News

  
ఛాంపియన్ సింధుతో షటిల్ ఆడిన మంత్రి లోకేష్ అందరి దృష్టిని ఆకర్షించారు.
హైదరాబాద్ నగరంలో ఫోక్ సింగర్ మంగ్లీ వివాదం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ నెలలోనే ఆయన విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. జగన్ విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. ఆయన కుటుంబంతో సహా యూరప్, యూకే పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్‌లో చర్చ జరుగుతుండగానే అమల్లోకి మహిళా కోటా.. అసలేం జరుగుతోంది?
స్లో ఒవర్ రేట్ కు ప్లేయర్లకు జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదంటున్నది మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. ఎంసీపీ క్రికెట్ విభాగం అధిపతి ఫ్రేజర్ స్టీవర్ట్ అయితే.. స్లో ఓవర్ రేట్ సమస్యకు ఆటగాళ్లను మాత్రమే బాధ్యులను చేయడం కాదని, దీనికి అంపైర్లను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కృత్రిమ మేధ కారణంగా రానున్న కాలంలో మానవ జీవనశైలిని పూర్తిగా మారిపోతుందన్నారు. ముందు ముందు మనిషి తన ఉనికి కోసం, కనీస అవసరాల కోసం పని చేయాల్సిన అవసరం లేని రోజులు రాబోతున్నాయన్నారు.
దేశ రాజధాని వేదికగా తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి గర్జించింది.
గత ఆరు యాసంగి సీజ‌న్ల‌లో కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌న్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయ‌న నివాసంలో శుక్రవారం కలిసిన తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున స‌ర‌ఫ‌రా పెంచాల‌ని ఇటీవ‌ల కేంద్ర‌ ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించారని గుర్తు చేశారు.
ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు, ఫోటోలు అనధికారంగా ఉపయోగించబడుతున్నాయన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను ఉపయోగించి అల్లు అర్జున్ మాట్లాడుతున్నట్లు గా కనిపించే వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నెల 20 నుంచి వచ్చే నెల 15 వరకు మొత్తం 25 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే.. ఇందుకు పలు షరతులు విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తన కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీతో పాటు అవసరమైన ష్యూరిటీ వివరాలను సిబిఐ అధికారులకు సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది.
మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా ధోరణిలోనూ మార్పు వస్తున్నది. ఇటీవల చికాగోలో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో మూడు లక్షల డాలర్ల ప్యాకేజీని వదులుకుని ఒక భారత మహిళా టెక్ నిపుణురాలు దుబాయ్‌కి తరలివెళ్లడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం ఆమె తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదని.. మారుతున్న గ్లోబల్ టెక్ ట్రెండ్ కు అద్దం పడుతోందని నిపుణులు అంటున్నారు.
ఇటీవల ఒక భారతీయ మహిళా టెక్ ప్రొఫెషనల్, చికాగోలో 3లక్షల డాలర్ల గూగుల్ జాబ్ ( భారత కరెన్సీలో అక్షరాలా.. 2,78,23,500.00 రూపాయలు) వదిలి, దుబాయ్ కు షిఫ్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమెది కేవలం వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే చూడలేం. ఇది ఒక పెద్ద ట్రెండ్ కు ప్రతీకగా చెప్పుకోవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.