అమెరికా డ్రీమ్ మసకబారుతోందా?

Publish Date:Apr 17, 2026

Advertisement

హెచ్ 1బి బంధనం,టెక్ లేఆఫ్స్, దుబాయ్ వైపు మరలుతున్న భారత టాలెంట్.. ఒక డీప్ డైవ్   విశ్లేషణ

 అమెరికన్ డ్రీమ్ ఒకప్పుడు స్పష్టంగా ఉండేది. అమెరికాలో  హై పే జాబ్, గ్రీన్ కార్డ్, సబర్బన్ హౌస్, మంచి స్కూల్స్. ఇప్పుడు అదే డ్రీమ్, ముఖ్యంగా ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్ కోసం, మారిపోయింది. లేదా కనీసం రూపం మార్చుకుంటోంది.
ఇటీవల ఒక భారతీయ మహిళా టెక్ ప్రొఫెషనల్, చికాగోలో  3లక్షల  డాలర్ల గూగుల్ జాబ్ ( భారత కరెన్సీలో అక్షరాలా.. 2,78,23,500.00 రూపాయలు) వదిలి, దుబాయ్ కు షిఫ్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమెది కేవలం వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే చూడలేం. ఇది ఒక పెద్ద ట్రెండ్ కు  ప్రతీకగా చెప్పుకోవచ్చు.
 గోల్డెన్ కేజ్  హెచ్1బి-  డబ్బు ఉంది, స్వేచ్ఛ లేదు. ఇదీ ఆమె చెప్పిన ప్రధాన పాయింట్. ఇది చాలా మందికి చాలా చాలా బలంగా తాకింది.  
- హెచ్1బి వీసా అంటే గోల్డెన్ కేజ్
- జీతం ఎక్కువ, కానీ
- ఒకే కంపెనీకి బంధనం
- సైడ్ బిజినెస్ చేయలేరు
- యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయలేరు
- అసిమెట్రికల్ రిటర్న్స్ అంటే.. సాలరీకి మించి సంపద సృష్టించే అవకాశాలు ప్రాక్టికల్ గా బ్లాక్ అవుతాయి. 
ఇది కేవలం ఆమె ఫీలింగ్ కాదు. అమెరికన్  టెక్ లేఆఫ్స్ 2023–24లో 3 లక్షలకుపైగా ఉద్యోగులను తాకాయి, ఇందులో పెద్ద భాగంహెచ్1బి హోల్డర్లే. 
వీసా బంధనం  
- జాబ్ పోతే   60 రోజుల్లో కొత్త స్పాన్సర్ దొరకాలి. లేకపోతే  దేశం విడిచి వెళ్లాలి. అంటే కెరీర్ రిస్క్, ఇమ్మిగ్రేషన్ రిస్క్
 డబ్బు కంటే దగ్గరితనం.. తల్లిదండ్రుల నుంచి దూరం, మనసులో ఖాళీ.  ఆమె నిర్ణయంలో రెండో పెద్ద కారణం కుటుంబం.
- సంవత్సరాల తరబడి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడలేకపోవడం
- టైమ్ జోన్, ట్రావెల్ ఖర్చు, వీసా పరిమితులు.
- చికాగోలో కంఫర్ట్ ఉంది, కానీ మనసులో గిల్ట్, ఖాళీ.
ఇది చాలా మంది ఎన్ఆర్ఐలు లోపల మౌనంగా మోస్తున్న భావన.
అమెరికన్ డ్రీమ్ స్లోగా  ఫ్యామిలీ డిస్టెన్స్  అనే ధరతో వస్తోంది.
 ఎందుకు దుబాయ్? అంటే.. జియోగ్రఫీ ,ఫ్రీడమ్ , ట్యాక్స్
ఆమె లాజిక్ సింపుల్, కానీ వెరీవెరీ స్ట్రాంగ్ 
- దుబాయ్ నుంచి ఇండియాకు మూడు నాలుగు గంటల ఫ్లైట్
- తరచూ చిన్న ట్రిప్స్, ఫ్యామిలీతో టైమ్ గడపొచ్చు.
-  యేఏఈ లోసైడ్ వెంచర్స్ అనుమతి
- మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్
- ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్
- అమెరికాతో తో పోలిస్తే సాలరీ తక్కువైనా, లైఫ్, వెల్త్, ఫ్రీడమ్. ఇదే బెటర్  ఈక్వేషన్ అని ఆమె భావించారు. 
ఇది ఒక కొత్త మ్యాథ్.. 
 మాక్స్ సాలరీ  కాదు.. మాక్స్ ఫ్రీడమ్ + మాక్స్ కంట్రోల్ + మినిమమ్ రెగ్రెట్.
 అమెరికా టెక్ మార్కెట్ రియాలిటీ..  లేఆఫ్స్, హెచ్1 బిస్ట్రాంగిల్, రిస్క్ పెరుగుదల. 
2022 నుంచి 3 లక్షలకుపైగా టెక్ లేఆఫ్స్. వీరిలో 30 నుంచి 40 శాతం  వరకు ఇండియన్ హెచ్1బి, ఎల్1 ప్రొఫెషనల్స్ అని అంచనాలు.
 టాప్ హెచ్1బి ఎంప్లాయర్లు 2022–23లో 85,000కుపైగా ఉద్యోగులను తొలగించారు 
ఇక పాలసీ వైపు చూస్తే..
- హెచ్1బి  అప్రూవల్స్ కఠినతరం
- కొత్త రూల్స్, ఎక్కువ డాక్యుమెంటేషన్
- వీసా ఫీజులు, లీగల్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి 
ఇది ఒక క్లియర్ మెసేజ్..
అమెరికా టెక్ ప్లస్ హెచ్1బి ఈజీక్వల్టూ హై రివార్డ్, కానీ ఇప్పుడు హై రిస్క్ కూడా. 
 కంపెనీలు కూడా మారుతున్నాయి.. జాబ్స్ ఇండియాకి, గల్ఫ్ కి షిఫ్ట్
ఒక సంవత్సరం లోపలే.. 
- 32,000కుపైగా హై స్కిల్ టెక్ రోల్స్ (ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ) అమెరికా నుంచి ఇండియాకు షిఫ్ట్ అయ్యాయి
- 2 లక్షలకుపైగా ప్రొఫెషనల్స్ ఇండియాలో హై ఎండ్ టెక్ రోల్స్ లో హైర్ అయ్యారు 
అంటే..
- కంపెనీలు కూడా సిలికాన్ వ్యాలీ సెంట్రిక్ మోడల్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ టాలెంట్ మోడల్ వైపు వెళ్తున్నాయి
- అమెరికాలో ఉండాల్సిందే అనే కంపల్షన్ తగ్గుతోంది
 జెన్జీ సిగ్నల్..  బిగ్ టెక్ ఆకర్షణ తగ్గుతోంది
డేటా ప్రకారం.. 
•    2023లో బిగ్ టెక్లోజెన్ జీ రిప్రజెంటేషన్ 15 శాతం కాగా, అది 2025 నాటికి 6.8శాతానికి పడిపోయింది
అంటే..   
- బిగ్ టెక్ = లైఫ్ గోల్ కాదు
- స్టార్టప్స్, క్రియేటర్ ఎకానమీ, రిమోట్ వర్క్, ఇండియా, యూఏఈ  ఆప్షన్స్
- ఒకే కంపెనీ, ఒకే దేశం, 30 ఏళ్ల కెరీర్  మోడల్ యువ ప్రెఫెషనల్స్ కి ఆకర్షణీయంగా లేదు
 అమెరికన్ డ్రీమ్  రీడిఫైన్ అవుతోంది, పూర్తిగా చనిపోలేదు
ఆమె చెప్పిన లైన్ చాలా ఇంపార్టెంట్.. 
 నేను అమెరికన్ డ్రీమ్ ను వదిలేయలేదు, దాన్ని రీడిఫైన్ చేసుకున్నాను. అమెరికాలో సంపాదించిన సేవింగ్స్ తో కెరీర్ బ్రేక్,  కంటెంట్ క్రియేషన్, బ్రాండ్ బిల్డింగ్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ఎక్స్ ప్లోర్ చేయడంతో పాటు సాలరీ మాక్సిమైజేషన్  నుంచి  లైఫ్ డిజైన్ + లాంగ్ టర్మ్ వెల్త్ + ఫ్రీడమ్  వైపు షిఫ్ట్
ఆన్లైన్ రియాక్షన్స్:
- కొందరికి ఇది ఇన్స్పైరింగ్
- కొందరికి ఇది ఇంప్రాక్టికల్
- కొందరు  ఇది ప్రివిలేజ్  అంటారు
కానీ డీప్ లో ఉన్న ట్రెండ్ మాత్రం క్లియర్.. 
టెక్ వర్కర్స్ ఇప్పుడు  జీతం కంటే  జీవితాన్ని కొలుస్తున్నారు.
 
తెలుగు కమ్యూనిటీ, ప్రత్యేకంగా:
- అమెరికాలో  ఉన్నహెచ్1బి ప్రొఫెషనల్స్
- ఇండియాలో ఉన్న, అమెరికాను డ్రీమ్ గా చూసే స్టూడెంట్స్
- గల్ఫ్, దుబాయ్ను ఆప్షన్ గా చూస్తున్న మిడిల్ కెరీర్ టెకీస్
వీళ్లందరికీ ఇప్పుడు కొన్ని హార్డ్ ప్రశ్నలు:
 - మీకు ముఖ్యమైంది ఏమిటి?
- మాక్స్ సాలరీనా?
- ఫ్యామిలీ దగ్గరగా ఉండడమా?
- ఫ్రీడమ్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, లైఫ్ డిజైన్?
- హెచ్1బి  బంధనం మీ రిస్క్ టాలరెన్స్కు సరిపోతుందా?
- ఇండియా + యూఏఈ + రిమోట్ వర్క్ కాంబినేషన్ మీకు బెటర్ ఈక్వేషన్ ఇవ్వగలదా?
- అమెరికన్ డ్రీమ్  మీకు ఇంకా అదేనా? లేక మీరు కూడా దాన్ని రీడిఫైన్ చేస్తున్నారా?
 అమెరికన్ డ్రీమ్ మసకబారడం కాదు… మారుతోంది
అమెరికన్ డ్రీమ్ చనిపోలేదు. కానీ అది ఇప్పుడు 
- ఒకే దేశం కాదు
- ఒకే పాస్పోర్ట్ కాదు
- ఒకే కంపెనీ కాదు
 
 ఎక్కడ ఉంటే నాకు ఫ్రీడమ్, ఫ్యామిలీ, ఫ్యూచర్ మూడు బ్యాలెన్స్ అవుతాయో  అదే నా డ్రీమ్. 
కొంతమందికి అది ఇంకా అమెరికా కావచ్చు. కొంతమందికి దుబాయ్. కొంతమందికి హైదరాబాద్, బెంగళూరు. కొంతమందికి మల్టీ-లొకేషన్ లైఫ్.
ప్రశ్న ఒక్కటే.. మీ డ్రీమ్ మీద మీకే కంట్రోల్ ఉందా? లేక వీసా, కంపెనీ, సిస్టమ్ కంట్రోల్లో ఉందా?

సేకరణ, సంకలనం :కంఠమనేని సీతారాం

By
en-us Political News

  
ఇరాన్ విషయంలో అమెరికా అంచనాలు తలకిందులవ్వడంతో ట్రంప్ సంయమనం కోల్పోయినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు.
గతంలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో, 1971లో డాలర్ నుంచి గోల్డ్ స్టాండర్డ్ తొలగించినప్పుడు కూడా ఇలాంటి భారీ ధరల పెరుగుదల కనిపించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పసిడి దూకుడుకు కేవలం కరెన్సీ విలువ తగ్గడమే కాకుండా.. పెరుగుతున్న జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఫియాట్ కరెన్సీలను అమ్మి, వాటి స్థానంలో బంగారం వంటి హార్డ్ అసెట్స్ కొనుగోలు చేసే ధోరణినే డీబేస్మెంట్ ట్రేడ్ అంటారు.
ముఖ్యంగా రెండో విడతలో భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 40,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు.  ఇది గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు. అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ సహకారాన్ని అందించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.