.పోలవరం పూర్తి చేసేది తెలుగుదేశమే,, తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే
Publish Date:Jul 27, 2023
Advertisement
పోలవరం ఎవరు పూర్తి చేస్తారు? అంటూ తెలుగువన్ ఆన్ లైన్ లో నిర్వహించిన పోల్ కు అద్భుత స్పందన లభించింది. మొత్తం కేవలం ఒక్క రోజు వ్యవధిలో 63వేల మంది ఈ పోల్ లో పాల్గొనగా వారిలో 84 శాతం మంది పోలవరం పూర్తి చేయడం అన్నది తెలుగుదేశం వల్లే అవుతుందని నిర్ద్వంద్వంగా చెప్పారు. కేవలం 12 శాతం మంది వైసీపీ పోలవరం పూర్తి చేస్తుందన్నారు. ఈ జాతీయ ప్రాజెక్టును బీజేపీయే పూర్తి చేస్తుందని 5శాతం మంది అభిప్రాయపడ్డారు. దార్శనికత ఉన్న నేత చంద్రబాబు మాత్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగరన్నది అత్యధిక ఆంధ్రుల అభిప్రాయమని తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులైనా, ప్రగతి అయినా, పురోగతి అయినా ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమౌతుందన్నది ఏపీలో మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ ఆన్ లైన్ పోల్ సర్వేలో ద్వారా అత్యధికులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. కేవలం పోలవరం తెలుగుదేశం మాత్రమే పూర్తి చేస్తుందంటూ టీడీపికీ టిక్ పెట్టడమే కాకుండా మెసేజీల ద్వారా తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావాల్సిందేనన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ పోల్ లో తేలింది. అసలు పోలవరం పురోగతి మందగించడానికీ, ప్రాజెక్టు పరిస్థితి ఈ రోజిలా తయారవ్వడానికి వైసీపీయే కారణమని పలువురు మెసేజీల రూపంలో ఈ పోల్ లో కుండబద్దలు కొట్టిన చందంగా చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ పోలవరంను నిర్వీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి.. అభివృద్ధి కార్యక్రమాలను కచ్చితంగా, లోపరహితంగా చేయగల ఒకే ఒక్క దార్శనికుడు చంద్రబాబు మాత్రమేనని చెప్పడమే కాకుండా.. ఏపీ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో 628 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.. కానీ జగన్ సర్కార్ ప్రతిదీ రివర్స్ లోనే చెప్పిందన్నది కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తానికి అదనంగా 500 కోట్ల రూపాయలు చెల్లించడంతోనే తేటతెల్లమైందంటున్నారు. తెలుగుదేశం హయాంలో పోలవరం పనులు చేపట్టినప్పుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉంది. కానీ రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ సర్కార్ మరో సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించే సమయానికి జగన్ సర్కార్ తీసుకు వచ్చిన కొత్త ఇసుక విధానం మేరకు టన్ను ఇసుకకు 375 రూపాయల చొప్పున చెల్లించాలసి వచ్చింది. దీంతో రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అన్న జగన్ సర్కార్ మాటలు డొల్లగానే మిగిలిపోయాయంటూ నెటిజన్లు పోలవరంపై తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/telugu-one-on-line-poll-25-159094.html





