ఇండియా కూటమికి దగ్గరౌతున్న కెసీఆర్
Publish Date:Jul 27, 2023
Advertisement
కొన్ని రోజులుగా బిజెపికి బీ టీంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ సడెన్ గా ప్లేట్ మార్చింది. విపక్ష కూటమి ఏర్పాటు చేసిన పాట్నా, బెంగుళూరు సమావేశాలకు దూరంగా ఉన్న బిఆర్ఎస్ ఎన్డియేపై అసమ్మతి నోటీసు ఇచ్చి కొత్త రాజకీయ సమీకరణాలకు ఆజ్యం పోసింది. ఐదేళ్ల క్రితం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కెసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ మోదీ వెంట ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ను వ్యతిరేకించిన కెసీఆర్ పార్టీ లోకసభలో ప్రవేశ పెట్టిన అసమ్మతి నోటీసుతో తిరిగి విపక్ష కూటమి ఇండియాకు చేరువ కావాలని చూస్తున్నారు. మణిపూర్ హింసను నిరసిస్తూ బిఆర్ఎస్ మోదీప్రభుత్వంపై అసమ్మతి నోటీసు ఇచ్చింది. బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు లోకసభలో అసమ్మతి నోటీసు జారీ చేశారు. ఆయన వెంట ఎంఐఎం కూడా ఉంది. ఇటీవలె బిఆర్ఎస్ కు దూరమైన ఎంఐఎం మణిపూర్ హింసపై ప్రవేశపెట్టే అసమ్మతి నోటీసుకు మద్దత్తుగా నిలిచింది.ఎంఐఎం కూడా అసమ్మతి నోటీసు ఇచ్చింది. ఎంఐఎం మాత్రం కాంగ్రెస్ కు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.భాగ్యలక్ష్మి వివాదంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ నుంచి ఎంఐఎం వైదొలగింది. ఎంఐఎం మొదటి నుంచి కాంగ్రెస్ కు దగ్గరగా ఉండేది. తిరిగి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చూస్తుంది. లిక్కర్ స్కాంలో కెసీఆర్ కూతురు కవిత పేరు ఉండటంతో కొన్ని రోజులుగా బిజెపిని కానీ, మోదీ ప్రభుత్వాన్ని కెసీఆర్ పల్లెత్తు మాట అనడం లేదు. బిజెపికి బిఆర్ఎస్ బీటీంగా మారిపోయిందని ప్రచారం జరిగింది. కవిత అరెస్ట్ ను అడ్డుకోవడానికి కెసీఆర్ స్వయంగా బిజెపి అధిష్టానంతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చడానికి ఎక్కువ దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అసమ్మతి నోటీసు కెసీఆర్ హైడ్రామా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉత్తుత్తి అసమ్మతి నోటీసు అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు.
దక్షిణాదిలో కర్ణాటక నుంచి విక్టరీ సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా గెలవవచ్చు అని పలు సర్వేలు చెబుతున్నాయి. కెసీఆర్ తెప్పించుకున్న సర్వేలో కూడా కాంగ్రెస్ విక్టరీ ఉండటంతో కర్ణాటక ఫలితాల తర్వాత కెసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది. ప్రతీ సారీ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/kcr-in-india-alliance-25-159086.html





