వరాలతో బిఆర్ఎస్ ప్రభుత్వానికి నిధుల లేమి
Publish Date:Jul 27, 2023
Advertisement
ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండటంతో తెలంగాణాలో బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన పథకాలను అమలు చేసేందుకు ఉత్తర్వులిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నారు. వారికిపెన్షన్లు పెంచుతున్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందిజ అప్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అవకాశాలు తక్కువ. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. అందుకే కార్పొరేషన్ల నుంచి అదనపు అప్పుల కోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇటీవలె పలు మార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు. అప్పుల కోసం అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఆర్బీఐ ద్వారా ప్రతీ నెలా నాలుగైదు వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని విక్రయిస్తున్నారు. ఇవి చాలకపోవడంతో గ్యారంటీ అప్పులు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీనికి కేంద్రం, ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి కొన్నినియమ నిబంధనలను ప్రవేశ పెట్టాయి. గ్యారంటీ అప్పు ఎట్లా తీరుస్తారనేది నివేదిస్తేనే కొత్తగా అప్పులు తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించడం, నిధుల కొరత మొదలవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. కనీసం గ్యారంటీ అప్పులనైనా పథకాలకు మళ్లించాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీములకు కూడా ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు. జూన్ మొదటి వారంలో అమలు చేయాల్సిన రైతుబంధు జులై నెల చివరి దశకు చేరుకున్నా పూర్తి కాలేదు. ఇప్పటి దాకా 5 ఎకరాల లోపు ఉన్న పట్టాదారులకు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందింది. ఇంకో రూ.2,500 కోట్లు అయితేనే రైతుబంధు పూర్తవుతుంది. ఇక జులైలోనే మొదలుపెడుతామని చెప్పిన దళితబంధు, గృహలక్ష్మి స్కీముల అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. బీసీ చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం స్కీమ్ గందరగోళంగా మారింది. మొదటిదశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికే ఇచ్చారు. బీసీ బంధు ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాధికారుల మధ్య సఖ్యత కుదరక బీసీ బంధు నిలిచిపోయింది.
విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఆ ఉద్యోగులను మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉద్యోగులుగా మార్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బిఆర్ఎస్ ప్రభుత్వం నిధుల లేమికి గురైనట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/kcr-govt--no-fund-25-159097.html





