ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు

Publish Date:Apr 24, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె  ముగిసింది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనల ఎట్టకేలకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు ఫల్రదమవ్వడంతో ముగిసింది. సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ)  ప్రకటించింది. శుక్రవారం (ఏప్రిల్ 24) అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో  జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం (ఏప్రిల్ 25) ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. 

అంతకు ముందు శుక్రవారం (ఏప్రిల్ 24) రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందంతో జేఏసీ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానంగా వేతన సవరణ), ఫిట్‌మెంట్,  సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈ క్రమంలో కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ను తక్షణమే మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

మిగిలిన కీలక డిమాండ్లలో ఒకటైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఉన్నతాధికారులు, జేఏసీ సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి  లిఖితపూర్వక హామీ లభించడంతో జేఏసీ నాయకులు  సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నారు.

గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. సమ్మె ముగియడంతో   బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రవాణా సౌకర్యం తిరిగి సాధారణ స్థితికి రావడంతో బస్టాండ్లు మళ్లీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో ఒక భాగమని, కార్మికుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని   భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సానుకూల నిర్ణయంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని లోక్ భవన్‌కు వెళ్లారు.
ఈ అసాధారణ పరిణామం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున 1.22 డాలర్లకు, డీజిల్ ధర 1.238 డాలర్లకు చేరింది.
తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. క
48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే, కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు.
చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.