ఏఐ.. ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ముప్పులేదు!

Publish Date:Apr 25, 2026

Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. సాంకేతిక రంగంపై దాని ప్రభావంతో ఉద్యోగాల కోత తప్పదన్న ఆందోళన జనాల్లో పెరుగుతూనే ఉంది. పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే లేఆఫ్స్‌ను ప్రకటించాయి. భవిష్యత్ లో మరింతమందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తారన్న వార్తలు ఐటీ ఎంప్లాయీస్‌ను గందరగోళంలోకి, భయాందోళనలలోకీ నెడుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.

ప్రొఫెసర్ మిశ్రా విశ్లేషణ మేరకు..   ప్రస్తుతం ఉన్న  చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాధనాలను లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్) అని అంటారు. అంతకుముందే ఉన్న సమాచారం ఆధారంగా ఇవి కొత్త టెక్స్ట్‌ను రెడీ చేస్తాయి. అంతే. అంటే  ఈ-మెయిల్స్ రాయడం, డాక్యుమెంట్స్‌ను సంక్షిప్త రూపంలో వివరించడం, కంప్యూటర్ కోడ్ రాయడం, వంటి  ఇవి అంతకుముందే ఉన్న సమాచారం ఆధారంగా ఇవి పని చేస్తాయి. పాత డేటాలోని సరళి, ధోరణలను గుర్తించి అందుకు అనుగుణంగా యూజర్లు అప్పగించిన పనులను పూర్తి చేస్తాయి. ప్రస్తుత ఎల్ఎల్‌ఎమ్‌లు మనుషుల్లాగా ఆలోచించలేవు.  కొత్తగా అవి వేటినీ సృష్టించలేవని మిత్రా అన్నారు. వాటి వద్ద అప్పటికే ఉన్న డేటా ఆధారంగానే అవి పనిచేస్తాయని వివరించారు. కాబట్టి, ఇవి మనుషులకు సహాయకారులుగా మాత్రమే పనిచేయగలవనీ, వారికి ప్రత్యామ్నాయంగా కావని ప్రొఫెసర్ విశాల్ మిశ్రా చెబుతున్నారు.  

మనుషుల బాధ్యతలను పూర్తిగా స్వీకరించే సత్తా ప్రస్తుత ఏఐకి లేదన్న ఆయన..   ఏఐ కేవలం మనుషులు చేసే పనుల్ని కాస్త మెరుగుపరుస్తుంది తప్ప  స్వతంత్ర నిర్ణయాలు, సృజనాత్మకత అవసరమైన వాస్తవిక ప్రపంచంలో ఎల్ఎల్‌ఎమ్‌లు  తడబడతాయని అన్నారు.  వైద్యం, ఇంజనీరింగ్, జర్నలిజం వంటి రంగాల్లో అంతిమ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయా రంగాల నిపుణులేనని స్పష్టం చేశారు.  అయితే..  ఎల్ఎల్ఎమ్‌లకు భిన్నమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐజీ అందుబాటులోకి వస్తే మాత్రం ప్రపంచంలో కొత్త మార్పులు వస్తాయని ప్రొఫెసర్ మిశ్రా  అభిప్రా యపడ్డారు మనుషులతో సమానమైన లేదా అంతకు మించిన సామర్థ్యం ఏజీఐకి ఉంటుందన్న ఆయన.. తర్కం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, తనంతట తానే కొత్త విషయాలను నేర్చుకోవడం వంటి సామర్థ్యాలు ఏఐజీకి ఉంటాయని  వివరించారు.

ఫలితంగా ఇవి కొత్త ఐడియాలను సృష్టిం చగలవన్నారు. ఒక కొత్త బిజినెస్ మోడల్‌ను లేదా కొత్త ఉత్పత్తిని డిజైన్ చేసే సత్తా ఈ టెక్‌కు ఉంటుందని వివరించారు. ఈ టెక్నాలజీ ఉనికిలోకి వచ్చాక అసలైన పెనుమార్పులు జరుగుతాయని చెప్పారు. అయితే, ఏజీఐ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం కచ్చితమైన సమాధానం లేదని  ఆయన చెప్పారు. 

By
en-us Political News

  
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం, ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే యూరప్ వద్ద ఉన్న నిల్వలు మరో ఆరు వారాలకు సరిపోవడమే గగనం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా సంక్షోభంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఇంధన సంక్షోభం మొదలైంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.