మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం
Publish Date:Dec 17, 2025
Advertisement
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
http://www.teluguone.com/news/content/telangana-panchayat-elections-39-211168.html




