తెలంగాణలో పొత్తులపై కమలం పార్టీ క్లారిటీ!

Publish Date:Mar 9, 2026

Advertisement

బీజేపీ ఎట్టకేలకు మౌనం వీడింది. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.  రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో  బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్‌తో పొత్తు  ప్రసక్తే లేదన్నారు. ఇది బీజేపీ తుదినిర్ణయమని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో   బీఆర్ఎస్‌  రెండుసార్లు, కాంగ్రెస్‌  ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు. 
 బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు.  తమ క్యాడర్ ను, లీడర్ లను కాపాడుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ బలమన్న రామచందర్ రావు.. రేవంత్ సర్కార్  ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో  ఘోరాతి ఘోరంగా విఫలమైందన్నారు.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, కుటుంబ పాలన వంటి అంశాల కారణంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన అటువంటి బీఆర్ఎస్ తో చేతులు కలిపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీతో.. తెలంగాణలో  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖపోరు అనివార్యం అని తేలిపోయింది.

అలాగే బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి పొత్తు అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించినట్లైంది.  అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో  బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించింది. ఇంత కాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్నా.. ఇంత వరకూ కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే.. ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రశక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.  

By
en-us Political News

  
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.