తెలంగాణ కొత్తగవర్నర్ శివప్రతాప్ శుక్లా
Publish Date:Mar 6, 2026
Advertisement
తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆయనను తెలంగాణ గవర్నర్ గా నియమించింది. అలాగే ఇప్పటి వరకూ తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్ ను, బెంగాల్ గవర్నర్‌గా ఆర్.ఎన్ రవిని నియమించింది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ గురువారం (మార్చి 5) సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 జులైలో జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా గవర్నర్‌గా సేవలించిందిన జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఇక వివాదాస్పద నిర్ణయాలు, చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చేశారు.
http://www.teluguone.com/news/content/telangana-new-governer-shiv-pratap-shukla-36-215099.html





