ఇరాన్ సరే.. అసలు యుద్ధం జరుగుతున్నదెక్కడంటే?

Publish Date:Apr 15, 2026

Advertisement

ప్రపంచం మొత్తం మధ్యప్రాచ్య ఘర్షణలపై దృష్టి పెట్టింది. ఇరాన్, ఇజ్రాయెల్, హార్ముజ్ జలసంధి, చమురు ధరలు. ఇవి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. కానీ అంతర్జాతీయ వ్యూహకర్తల దృష్టిలో..  ఇవన్నీ ఒక పెద్ద గేమ్ లో చిన్న చిన్న ఫ్రంట్లు మాత్రమే.
అసలు పోరు అమెరికా, చైనా మధ్య జరుగుతోంది.  అది కూడా నేరుగా కాదు, సరఫరా గొలుసులు, చమురు ప్రవాహాలు, వాణిజ్య మార్గాలు, సాంకేతిక ఆధిపత్యం వంటి రంగాల్లో. 
ఈ విశ్లేషణలో మూడు కీలక అంశాలు ఉన్నాయి.. అవేంటంటే? 
  1. చైనా ఎదుగుదల  అమెరికాకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ 
రే డాలియో సిద్ధాంతం ప్రకారం.. ఎదుగుతున్న శక్తి స్థాపిత శక్తికి దగ్గరైనప్పుడు ఘర్షణ అనివార్యం.
చరిత్రలో ఇదే జరిగింది.
- జర్మనీ ఎదుగుదల.. మొదటి ప్రపంచ యుద్ధం
- జపాన్ ఎదుగుదల..  రెండవ ప్రపంచ యుద్ధం
- సోవియట్ యూనియన్ ఎదుగుదల..  కోల్డ్ వార్
ఇప్పుడు అదే పరిస్థితి చైనా, అమెరికా మధ్య కనిపిస్తోంది.
చైనా ఎదుగుదల గణాంకాలు..
 - ప్రపంచ చమురు వినియోగంలో 28శాతం
- 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం
- ప్రపంచ తయారీ రంగంలో 30శాతం వాటా
- యూరప్ తో వాణిజ్యంలో వేగవంతమైన పెరుగుదల
అమెరికా దృష్టిలో ఇది తన సూపర్ పవర్ స్థానం కోల్పోయే ప్రమాదం.

2. చైనా బలహీనత.. ఇంధనంపై భారీగా ఆధారపడటం. చైనా తన చమురులో 73శాతం దిగుమతి చేసుకుంటుంది. దాని ప్రధాన సరఫరాదారులు..
వెనిజులా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా.
ఇవి చైనా ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ పైప్ లైన్లు.
అయితే ఇటీవల  వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి  చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి,  సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. 
వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో  20 శాతం  తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
 3. చైనా  మోడర్న్ సిల్క్ రోడ్ .. అమెరికా వ్యూహంలో తదుపరి లక్ష్యం
చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా    యూరప్ తో వాణిజ్యాన్ని పెంచుతోంది.  ఆసియా–యూరప్ మధ్య రైల్వేలు, పోర్టులు, పైప్ లైన్లు నిర్మిస్తోంది. ఇందు కోసం ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఎందుకంటే..  యూరప్ తో  వాణిజ్యాన్ని ఎవరు నియంత్రిస్తారో… వారే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారు.
 
• జర్మనీ చైనా వైపు మొగ్గు
• ఫ్రాన్స్ కొత్త ఒప్పందాలు
• ఇటలీ బీఆర్ఐలో చేరడం వంటివి  అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ ఈ సిల్క్ రోడ్ లో కీలక లింక్. ఇరాన్ అస్థిరత,  చైనా, యూరప్ వాణిజ్య మార్గం దెబ్బతినడం.
  4. అమెరికా వ్యూహం: ప్రత్యక్ష యుద్ధం కాదు… సరఫరా గొలుసుల యుద్ధం. అమెరికా చైనాతో నేరుగా యుద్ధం చేయడం అసాధ్యం. కానీ చైనాను బలహీనపరచడానికి ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలు, సాంకేతిక ఆధిపత్యం వంటి రంగాల్లో ఒత్తిడి పెంచుతోంది.
ఇందులో భాగమే.. 
 వెనిజులా సరఫరా   అంతరాయం
 ఇరాన్ సరఫరా పై యుద్ధ ప్రభావం
 రష్యా సరఫరాపై  ఆంక్షలు
 సౌదీ   ఉత్పత్తి తగ్గుదల
వీటి వల్ల చైనా  ఆర్థిక వ్యవస్థకు ఇంధన సంక్షోభం ముప్పు. 
 5. తైవాన్ ..  అసలు వేదిక
తైవాన్ ప్రపంచంలోని 90శాతం  అధునాతన చిప్స్ తయారు చేస్తుంది. అందువల్ల  తైవాన్ ను ఎవరు నియంత్రిస్తారో వారిదే..  21వ శతాబ్దపు సాంకేతిక ఆధిపత్యం.  అమెరికా, చైనా మధ్య అసలు పోరు ఇక్కడే తార స్థాయికి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

6. అమెరికాకు మరో లాభం ఏమిటంటే.. ఆయుధ ఒప్పందాలు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా  గల్ఫ్ దేశాలు రక్షణ ఖర్చులు పెంచుతాయి. అంటే    అమెరికా ఆయుధాల కొనుగోలు పెరుగుతుంది. తద్వారా ప్రతీ సంక్షోభం అమెరికాకు బిలియన్ల డాలర్ల లాభం తెచ్చిపెడుతుంది. 
 అంటే ఇది వేర్వేరు యుద్ధాలు కాదు  ఒకే వ్యూహం.  వెనిజులా, ఇరాన్, రష్యా, యూరప్ వన్నీ వేర్వేరు సంఘటనలుగా కనిపించినా, జియోపాలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ ఒకే పెద్ద వ్యూహంలో భాగం మాత్రమే. ఆ వ్యూహం  చైనా ఎదుగుదలను నెమ్మదింపజేయడం.

ఇక అమెరికా లక్ష్యాలు ఏంటంటే..  చైనా ఇంధనాన్ని కట్ చేయడం. ఆ దేశ వాణిజ్య మార్గాలను అడ్డుకోవడం. యూరప్ ను చైనా కు దూరం చేయడం. ఇంకా ఆయుధాల విక్రయం ద్వాలా లబ్ధి పొందడం.  తైవాన్ ఘర్షణకు ముందు చైనాను బలహీనపరచడం. ఇక చివరిగా.. ప్రపంచం ఇరాన్ ను చూస్తోంది కానీ అసలు యుద్ధం మాత్రం చైనా ఎదుగుదల, అమెరికా ఆధిపత్యం మధ్య జరుగుతోంది. ఇది కేవలం యుద్ధం కాదు.. ఇది 21వ శతాబ్దపు ప్రపంచ శక్తుల పునర్వ్యవస్థీకరణ. 

సంకలనం, సేకరణ: సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
ట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు.
గతంలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో, 1971లో డాలర్ నుంచి గోల్డ్ స్టాండర్డ్ తొలగించినప్పుడు కూడా ఇలాంటి భారీ ధరల పెరుగుదల కనిపించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పసిడి దూకుడుకు కేవలం కరెన్సీ విలువ తగ్గడమే కాకుండా.. పెరుగుతున్న జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఫియాట్ కరెన్సీలను అమ్మి, వాటి స్థానంలో బంగారం వంటి హార్డ్ అసెట్స్ కొనుగోలు చేసే ధోరణినే డీబేస్మెంట్ ట్రేడ్ అంటారు.
ముఖ్యంగా రెండో విడతలో భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 40,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు.  ఇది గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు. అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ సహకారాన్ని అందించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.