టీమ్ ఇండియా రికార్డుల మోత
Publish Date:Mar 5, 2026
Advertisement
ముంబై బాంఖేడీ స్టేడియంలో గురువారం (మార్చి 5) జరిగిన ఇంగ్లండ్- ఇండియా రెండో సెమీస్ మ్యాచ్ లో రికార్డులు మోతమోగాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను టీమ్ ఇండియా కేవలం విజయంతో మాత్రమే సరిపెట్టలేదు. టి20 ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది టీమ్ ఇండియా. సెమీస్ లేదా ఫైనల్స్ లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు ఏ జట్టు కూడా.. ఇంత వరకూ నాకౌట్ మ్యాచ్ లో 250 పరుగుల మైలు రాయి దాట లేదు. అలాగే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండాయా, ఇంగ్లాండ్ కలిసి 499 పరుగులు చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ పూర్తి స్థాయి రన్- ఫెస్ట్ గా చరిత్రలో నిలిచిపోయింది. సంజూ శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 89 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. టీ 20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో అత్యధిక స్కోరు చేసిన రికార్డును సమం చేశాడు. 2016లో విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పై 89 నాటౌట్ రికార్డును టచ్ చేశాడు సంజూశాంసన్. ఇక ఈ ఇన్నింగ్స్ లో భారత్ మొత్తం 19 సిక్సర్లు బాదింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్ల మ్యాచ్ ఇదే. మ్యాచ్ మొత్తంగా రెండు జట్లు కలిసి 34 సిక్సర్లు కొట్టడం విశేషం. ఈ గెలుపుతో భారత్ నాలుగో సారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది టీమిండియా. వరుసగా రెండో సారి ఫైనల్స్ చేరిన మూడవ జట్టుగా నిలిచింది భారత్. గతంలో పాక్, తర్వాత శ్రీలంక ఇలా వరుసగా మూడో సారిఫైనల్స్ కు చేరాయి.
http://www.teluguone.com/news/content/team-india-create-several-records-36-215098.html





