హోలీ పండుగను బుధవారం (మార్చి 4) జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. సర్కార్ విడుదల చ ేసిన వాల్ అకడామిక్ క్యాలెండర్ 2026-26లో హోలీ పండుగ సెలవును మార్చి 4గా పేర్కొంది. కాగా 2026 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన సాధారణ సెలవుల జాబితాలో హోలీపండుగ మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ప్రకటనల మధ్య తేదీలలో తేడా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలు మరియు ఇతర విభాగాల్లో ఒకింత గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యా లయం అధికారిక గెజిట్‌లో ప్రకటించిన సెలవుల జాబితానే తుది నిర్ణయంగా పరిగణించాలనీ, అందువల్ల మార్చి 3వ తేదీన హోలీ పండుగ సెలవును పాటించాలని అన్ని శాఖలకు అంతర్గత ఉత్తర్వులు పంపించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలు, ఇతర అనుబంధ సంస్థలు మార్చి 3 సెలవు పాటించను న్నాయి. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న తేదీకి బదులుగా అధికారిక సెలవుల జాబితాలో ఉన్న తేదీనే అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హోళీ పండుగను దృష్టిలో ఉంచుకుని అవసరమైన పరిపాలనా ఏర్పాట్లు చేసుకోవాలని, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. తేదీ మార్పుపై ఎటువంటి సందేహాలు లేకుండా అన్ని విభాగాలు ప్రభుత్వ తాజా ఉత్తర్వులను అనుసరించా లని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-government-clarity-on-holi-holiday-36-214892.html
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.