తెలంగాణ డీజీపీ ఎదుట 47 మంది మావోలు లొంగుబాటు

Publish Date:Apr 25, 2026

Advertisement

 

తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 47 మంది మావోయిస్టు కేడర్లు జనజీవన స్రవంతిలోకి చేరారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల వివరాల ప్రకారం, Peoples Liberation Guerrilla Army (PLGA)కు చెందిన కీలక కమాండర్ హేమ్లాతో పాటు 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందినవారని అధికారులు తెలిపారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు 32 ఆయుధాలు, 515 తూటాలను పోలీసులకు అప్పగించారు. ఇది భద్రతా దళాలకు పెద్ద విజయంగా అధికారులు పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్రంలో శాంతి భద్రతల బలోపేతానికి ఇది కీలక అడుగని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు–పునరావాస విధానంపై విశ్వాసం పెరగడంతోనే మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.“తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోవడం రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పరిణామం. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలపై నమ్మకం పెరిగినందునే వారు హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నాం” అని డీజీపీ పేర్కొన్నారు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నాయకులు కూడా ఈ లొంగుబాటులో ఉన్నారు. వీరిలో దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్‌చార్జి హేమ్లా, డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లచ్చు @ మనోజ్ వంటి నాయకులు ఉన్నారు. ఈ లొంగుబాటుతో దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ దాదాపు నిర్వీర్యమైందని డీజీపీ తెలిపారు.లొంగిపోయిన వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో LMGలు, AK-47లు, SLR, INSAS రైఫిల్స్, మస్కెట్ రైఫిల్స్, పిస్టల్స్, రివాల్వర్లు, BGL గన్స్, ఎయిర్ గన్స్, SBBL గన్స్ ఉన్నాయి.

అదేవిధంగా, PLGA బెటాలియన్ నుంచి 4 మంది, DKSZC నుంచి 28 మంది, 9వ మరియు 30వ ప్లాటూన్ల నుంచి 15 మంది లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.ఇంకా అజ్ఞాతంలో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోషం, స్టేట్ కమిటీ సభ్యురాలు జాడి రత్నబాయి అలియాస్ సుజాత, స్టేట్ కమిటీ సభ్యుడు వార్తా శేఖర్ అలియాస్ మంగు కూడా లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.గత రెండేళ్లలో మొత్తం 818 మంది మావోయిస్టులు లొంగిపోగా, 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల బలోపేతానికి ఇది మరో కీలక ముందడుగని ఆయన అన్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
సూర్యగ్రహణం వేళ కరెంట్ వాడకం తగ్గించిన వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆక్టోపస్ ఎనర్జీ ఆఫర్ ప్రకటించింది. సోలార్ పవర్ కొరత, గ్రిడ్ భద్రత మరియు నిపుణుల విశ్లేషణల పూర్తి వివరాలు ఇవే!
ప్రయాణాల్లో లేదా ఎక్కడైనా సులభంగా, అత్యంత ఉత్పాదకంగా పనిచేసేందుకు అవసరమైన బెస్ట్ రిమోట్ వర్కింగ్ గ్యాడ్జెట్లు, ల్యాప్‌టాప్ స్టాండ్‌లు, నోయిస్ కాన్సెలేషన్ హెడ్‌ఫోన్లు మరియు పవర్ బ్యాంక్స్ వివరాలు తెలుసుకోండి.
న్యూయార్క్‌ను ఊపేసిన రష్యన్ స్లీపర్ ఏజెంట్ ఆన్నా చాప్‌మ్యాన్ సంచలన నిజాలు తెలుసుకోండి. ఎఫ్‌బీఐ ఆపరేషన్ గోస్ట్ స్టోరీస్ నుండి ఛానల్ 4 డాక్యుమెంటరీ వరకు పూర్తి థ్రిల్లింగ్ వివరాలు ఇక్కడ చదవండి.
ఒక రూపాయి యూపీఐ చెల్లింపు వెనుక అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఏటా ₹20,000 కోట్ల వ్యయం, ప్రతి లావాదేవీకి 83 పైసల ఖర్చు మరియు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వివరాలు మీకోసం.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి గల ముఖ్యమైన కారణాలు, రంగాలవారీ పనితీరు మరియు మార్కెట్ విశ్లేషణను వివరంగా తెలుసుకోండి.
టీసీఎస్, హెచ్‌సీఎల్ కంపెనీలపై సైబర్ దాడి ముప్పు వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోండి. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఐటీ దిగ్గజాలు ఇచ్చిన స్పష్టత, 4 ఏళ్ల నాటి డేటా లీక్ వివరాలు మరియు చైనా, పాకిస్థాన్ల సైబర్ దాడుల నివేదికల పూర్తి విశ్లేషణ.
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఆర్డీ ఇండస్ట్రీస్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో దాదాపు 39 శాతం భారీ ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. 139 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఈ రీసైక్లింగ్ కంపెనీ ఐపీఓ వివరాలు, లిస్టింగ్ ధర మరియు ఆర్థిక వృద్ధి సమాచారం కోసం ఇప్పుడే చదవండి.
సింక్విఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించారు. ప్రపంచ ఛాలెంజర్ జావోఖిర్ సిందరోవ్‌ను 95 ఎత్తుల పోరులో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన సుదీర్ఘకాల ప్రేమికురాలు జార్జినా రోడ్రిగెజ్‌ను పోర్చుగల్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. 2017లో షాపింగ్ మాల్‌లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం, పెళ్లి పీటల వరకు ఎలా సాగిందో తెలుసుకోవడానికి ఈ వెబ్ స్టోరీ చదవండి!
ఇంటి కోసం రూ.90 లక్షల అప్పు చేసిన విద్యుత్ ఉద్యోగి.. బ్యాంక్ లోన్ రాక బలవన్మరణం..!
ఐపీఎల్ 2027 ట్రేడింగ్‌కు ముందే హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాలు నెలకొన్నాయి. గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లేందుకు హార్దిక్ విధించిన కెప్టెన్సీ షరతు, శుభ్‌మన్ గిల్ స్పందన మరియు ముంబై ఇండియన్స్ నిర్ణయంపై పూర్తి సమాచారం కోసం ఈ వెబ్ స్టోరీ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.