బీసీసీఐ వరల్డ్ కప్ ప్రణాళిక.. విన్ తో రోకోకు ఘనవీడ్కోలే లక్ష్యం!

Publish Date:Mar 10, 2026

Advertisement

ఇప్పటికే టెస్ట్, టి20 ఫార్మట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఆ వన్డేలకు కూడా 2027 వరల్డ్ కప్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించడం లాంఛనమే అన్నది క్రీడాపండితుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రోకో (రోహిత్ శర్మ, కోహ్లీ)లకు ఘన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ రూపొందింది. 2027 వన్డే వరల్డ్ కప్ విజయాన్ని వారికి వీడ్కోలు బహుమానంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో రూపొందించినట్లుగా ఈ షెడ్యూల్ ఉంది.  

దీంతో వచ్చే వరల్డ్ కప్ లోగా టీమ్ ఇండియా కనీసం 20 వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. వీటిలో  ఈ ఏడాది అంటే 2026లో ఆప్ఘనిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఉండగా  వచ్చే ఏడాది ఆసియా కప్ లో భాగంగా కనీసం ఐదు వన్డేలు ఉన్నాయి.  ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే రోకో ఫామ్ ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ ఈ షెడ్యూల్ రూపొందించిందని అవగతమౌతుంది.

ఇంకో విశేషం ఏమిటంటే.. వీటిలో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను మినహాయిస్తే.. మిగిలిన సిరీస్ లన్నీ ఇండియా వేదికగా జరుగుతాయి. ఇక ఆసియాకప్ మ్యాచ్ లైతే బంగ్లాదేశ్ లేదా తటస్థ వేదికపై జరుగుతాయి.   ఇక రోకో విషయానికి వస్తే 2027 వన్డే వరల్డ్ కప్ విజయమే తమ లక్ష్యం అని ఇరువురూ పలు సందర్బాలలో చెప్పారు. అయితే చీఫ్ కోచ్ ప్రణాళికలు ఎలా ఉన్నాయన్నది అర్ధం కావడం లేదు.

ప్లేయర్లు ఎవరన్నది కాదు. విజయమే ముఖ్యం అని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ వస్తున్న గంభీర్ కు కోహ్లీ రోహిత్ లతో ఉన్న విభేదాలు తెలియంది కాదు. అయితే బీసీసీఐ మాత్రం వన్డే వరల్డ్ కప్ లో రోకో ఆడాలని భావిస్తే మాత్రం వారికి అవకాశం ఇచ్చి తీరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.
విశాఖపట్నం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, స్నేహితులు తనపై దాడి చేశారన్న అవమానభారంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.