సందేహాలన్నీ పటాపంచలు.. టి20 క్రికెట్ లో టీమ్ ఇండియా ఇప్పుడో అజేయశక్తి!

Publish Date:Mar 10, 2026

Advertisement

భారత క్రికెట్ చరిత్రలో  నవశకం మొదలైందా? యంగ్ టీమ్ ఇండియా ఇప్పుడు అజేయ జట్టుగా చరిత్రలో నిలబడిపోతుందా?  సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి దిగ్గజాలు దాదాపుగా ఒకే సమయంలో రిటైర్ అయినప్పుడు.. ఇక టీమ్ ఇండియా పరిస్థితి ఏమిటి? మ్యాచ్ లు గెలవడం అటుంచి కనీసం పోటీ ఇవ్వగలదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ వచ్చారు.

అయితే సచిన్ తదితరులు రిటైర్ అయిన తరువాత.. కోహ్లీ, ధోనీ వంటి వారు పుంజుకుని జట్టును గాడిలో పెట్టేందుకు కొంత సమయం పట్టింది.  అయితే.. ఇప్పుడు ఆ పరిస్థిి లేదు.  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పొట్టి క్రికెట్ కు అంటే టి20 ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా టీమ్ ఇండియాకు మేమున్నామంటూ బోలెడంత మంది యువక్రికెటర్లు రెడీ అయ్యారు.   రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించి 20 నెలలు కూడా గడవకముందే.. అదే పొట్టి ఫార్మట్ అంటే టి20 వరల్డ్ కప్ ను టీమ్ ఇండియా ముద్దాడింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర యుంగ్ ప్లేయర్లదే.   

రో‘హిట్’ ఛేజింగ్ కింగ్   కోహ్లీ  లేని టీ20 జట్టు ఈ ఫార్మట్ లో రాణించగలదా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. పెద్ద సంఖ్యలో యంగ్ టాలెంట్ అందుబాటులోకి వచ్చింది. అలా టి20 వరల్డ్ కప్ 2026 విజయంలో అత్యంత కీలకంగా మారిన ప్లేయర్లు ఎవరని చూస్తే.. మొదటిగా గుర్తుకు వచ్చే పేరు సంజూ శాంసన్.. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టులో చోటు కోల్పోయిన సంజూ శాంసన్ రింకూ సింగ్ అందుబాటులో లేని సమయంలో వచ్చిన ఛాన్స్‌ను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అత్యంత కీలకమైన చివరి మూడు మ్యాచ్ లలోనూ అద్భుతంగా రాణించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.

ఆ తరువాత చెప్పుకోవలసిన ప్లేయర్ ఇషాన్ కిషన్.. దాదాపు రెండేళ్లకు పైగా టీమ్ ఇండియాలో చోటుదక్కక.. దేశవాళీ క్రికెట్ ఆడి టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఇషాన్ కిషన్ టి20 వరల్డ్ కప్ జట్టులో బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నాడు. అంతే కాదు దాదాది దేశమైన పాకిస్థాన్ తో మ్యాచ్ లో అదరగొట్టాడు. ఆ తరువాత కూడా వేగంగా స్కోర్ చేయడంలో తన మార్క్ చూపించి జట్టులో అత్యంత కీలక సభ్యుడయ్యాడు. ఇక ఈ తరువాత చెప్పుకోవాలంటే తిలక్ వర్మ.. హైదరాబాదీ అయిన తిలక్ వర్మ వరల్డ్ కప్ టోర్నీ ఆసాంతం తన విలువ ఏమిటన్నది చాటి చెప్పే ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. తాను కేవలం ప్లేయర్ ను మాత్రమే కాననీ, ఇంపార్టెంట్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మర్ ననీ నిరూపించుకున్నాడు. ఆ తరువాత అభిషేక్ శర్మ... 22 ఏళ్ల ఈ కాశ్మీరీ యువకుడు వరల్డ్ కప్ టోర్నీలో అనుకున్నంతగా రాణించకపోయినా, కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో అదరగొట్టేశాడు. టోర్నీలోనే అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో అలరించాడు.   

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. డెడ్లీ బూమ్రా ఉండనే ఉన్నాడు. అతడికి పూర్తి సహకారం అందించే మరో పేస్ బౌలర్ కోం అన్వేషణ సాగించాల్సిన అవసరాన్ని వరల్డ్ కప్ టోర్నీ ఎత్తి చూపింది.  హర్షదీప్, సిరాజ్ లు ఉన్నా.. మరో నాణ్యమైన పేసర్ అవసరం జట్టుకు ఉంది.   ఇక విరాట్, రోహిత్ లు ఒకే సారి పొట్టి ఫార్మట్ నుంచి రిటైర్ అయినా ఆ లోటు ఇసుమంతైనా కనిపించకుండా టీమ్ ఇండియా అజేయజట్టుగా రూపుదిద్దుకుందంటే.. అందుకు  గతంలో రాహుల్ ద్రావిడ్, ఇప్పుడు వీవీఎస్ లక్ష్హణ్ లు యువక్రికెటర్లకు ఇస్తున్న శిక్షణే కారణమని చెప్పక తప్పదు. జట్టు చీఫ్ కోచ్ వరల్డ్ కప్ విక్టరీ తరువాత మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.    

By
en-us Political News

  
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్, అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని రాహుల్ గాంధీ అభివర్ణించారు
చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు సాధారణ మందగమనం కంటే ఎక్కువగా, ఒక లోతైన వ్యవస్థాత్మక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఏడో రోజుకి చేరుకున్నాయి.
దేశ అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో శుక్రవారం అనూహ్యమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు ్ర నాషిక్ పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న కేసులు. టీసీఎస్ లో ఉద్యోగుల్లా చేరిన మహిళా పోలీసులు. సుమారు ఏడెనిమిది మంది మహిళా పోలీసులు టీసీఎస్ నాసిక్ యూటిన్ లో ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా చేరారు. దాదాపు రెండు మూరు వారాలు.. కొన్ని నివేదిక ప్రకారమైతే 40 రోజులు అక్కడ పని చేసి వర్క్ ప్లేస్ బిహేవియర్ ను నేరుగా గమనించారు. పరిశీలించారు. గూమింగ్, లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ సేకరించారు. ఇది సాధారణ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణ కాదు. పూర్తిగా ప్రణాళికా బద్ధంగా జరిగిన అండర్ కవర్ ఆపరేషన్.
అమెరికాపై నాన్‌స్టాప్‌ సెటైర్లు వేస్తూ, ఏఐ, లెగో వీడియోలతో ఇరాన్ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.