Publish Date:Aug 17, 2022
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. యాప్‌ని డౌన్లోడ్ చేసుకోమంటూ రెండో రోజు సెల్‌డౌన్ కొనసాగించారు. ఉపా ధ్యాయ సంఘాలకు మద్దతుగా ఆందోళనలో టీడీపీ నేత అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యా య సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని స్పష్టం చేశారు. తమ సెల్ ఫోన్ లలో యాప్ డౌన్లోడ్‌నుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
317 జీవో కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిం చేందుకు గతంలోనూ హామీ ఇచ్చినా.. కనీసం చర్చించడం లేదన్నారు. కేవలం ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చేవారితో చర్చించి.. వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో 317 కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనూ హామీ ఇచ్చారు. అయినా కనీసం చర్చిం చడంలేదు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలి.
వ్యక్తిగత సమాచారం చోరీ కోసమే యాప్ డౌన్లోడ్‌పై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని అశోక్ ఆరోపించారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారం మాకెందుకు అంటూనే, మీరెక్కడెక్కడ తిరుగుతున్నారో మా వద్ద సమాచారం ఉందని అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇదే తరహా ఒత్తిడి కొనసాగిస్తే సెల్ డౌన్‌తో పాటు యాప్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ డిమాండ్లు అంగీకరించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమన్నారు. జగన్మోహన్ రెడ్డి నూతన విధానం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/teachers-suffered-due-to-go317-says-ashok-25-142096.html
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..