Publish Date:Aug 17, 2022
మంచి కలర్‌ఫుల్ కార్డు, అంతకుమించి కళ్లను ఇట్టి కట్టిపడేసే బంగ్లా బొమ్మ చూడంగానే ఢామ్ పడేసేట్టు ఉంటుంది. కార్డు ఫోర్డు తెరవగానే అది ఎక్కడున్నదీ చుట్టుపక్కలేమున్నదీ అన్నివివరాలూ ఉంటాయి. చూస్తున్నంతసేపూ సదరు రిప్రజంటేటివ్ కామెంట్రీతో ఊదరగొడతాడు.. ఇదీ రియల్ ఎస్టేట్ వారి ప్రచార పద్ధతి. కొనబోతే జీవితంలో ఏదో నష్టపోతారన్న స్థాయిలో భయపెడతారు.
ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రచారాలు, కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిపోతున్నాయి. అదీ ఒక్క ఫ్లాట్ లేదా విల్లా గురించిన హడావుడి. కానీ చిత్రంగా ఏకంగా ఒక దీవి కోసమూ ఇదే స్థాయి ప్రచారం జరుగుతోంది. కేవలం మూడు కోట్లు చెల్లిస్తే ప్లడ్డా ఐలెండ్ మీ సొంతం అంటున్నారు!
ఈ ద్వీపంలో ఐదు బెడ్‌రూమ్‌ల ఇల్లు ఉంది, ఒక హెలిపాడ్, ఒక లైట్ హౌస్ ఉంది. ఇదేమీ ఈమధ్య నాటి ది కాదు. ఏకంగా 1790ల్లోది! ఎంతో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉన్న ఈ ద్వీపం ఖరీదు ముంబైలో 3 బి హెచ్‌కె ఖరీదు కంటే తక్కువేనట! మొత్తం 28 ఎకరాల ఈ ద్వీపం చాలాకాలం నుంచి ఖాళీగానే ఉంది. ఎవరూ ఇక్కడికి వెళ్లడం, ఉండటం జరగలేదు. అయితే ముప్పయ్యేళ్ల క్రితం దీన్ని ఆరాన్ ఎస్టేట్ వారు అమ్మేశారు. దీన్ని డెరిక్, సాలీ మార్టన్ అనే డిజైనర్లు కొన్నారు.
కనుక ప్రస్తుతం వారిద్దరూ దీని యజమా నులు. ఈ ద్వీపం సరిగ్గా గ్లాస్గో నుంచి 31 మైళ్ల దూరంలో ఉంది. ఆర్డొస్సాన్ నుంచి పడవలో ఇక్కడికి చేరు కోవచ్చు. ఈ ద్వీపంలో వందకు పైగా రకాల పక్షలు ఉన్నాయి. కాగా లైట్ హౌస్‌ని 1990 నుంచి ఎడిన్‌బర్గ్ నిర్వహిస్తోందిట. పురాతనపద్దతిలో అద్దం, నూనె దీపం తీసేసి వాటి స్థానంలో సోలార్ శక్తి తో నడిచే ఎల్ ఇ డి లైట్లు అమర్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-island-costs-rs3-crores-25-142094.html
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..