కడపలో దూసుకుపోతున్న మాధవీ రెడ్డి.. డిప్యూటీ సీఎంకు షాక్ తప్పదా?

Publish Date:Apr 29, 2024

Advertisement

కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది.  ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది.

ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గమే అయినా.. గత ఐదేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంజాద్ పాష పని తీరు పట్ల అసంతృప్తి ఎన్నికల సమయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటున్నారు. 

దానికి తోడు అంజాద్ పాషాకు ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాకుండా పార్టీలో వర్గపోరు కూడా ఇబ్బంది పెడుతోంది.  ముఖ్యంగా కడప కార్పొరేటర్లు ఈ సారి వైసీపీకి దూరం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. 
వైఎస్ఆర్ పై అభిమానంతో వైసీపీకి గత ఎన్నికలలో మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లలో చాలా మంది ఇతర పార్టీలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశంకు వలస వెళ్లిపోయిన పరిస్థితి.  తొలి నుంచీ కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ మరణం తరువాత వైసీపీకి కంచుకోటగా మారింది.   

అయితే ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంం అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డప్పగారి మాధవీరెడ్డి నాయకత్వ పటిమ, ప్రచార వ్యూహాలతో కడపలో రాజకీయ ముఖచిత్రం దాదాపుగా మారిపోయిందంటున్నారు. ఆమె ప్రచార శైలి, మాట తీరుతో నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారనీ, మరీ ముఖ్యంగా మైనారిటీలు, మహిళల్లో ఆమె పట్ల ఆదరణ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.    మాధవీరెడ్డి ప్రచారశైలి, వ్యక్తం చేస్తున్న ఆత్మవిశ్వాసం పట్ల తెలుగుదేశం హైకమాండ్ కూడా సంతోషంగా ఉంది. మాధవీలత ధైర్యాన్నీ, కడపలో వైసీపీ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న తీరునూ ప్రశంసిస్తోంది.  

By
en-us Political News

  
జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
 ఎపిలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి  రిలీఫ్ అయ్యింది. మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.
ఏపీలో పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నికల సంఘం కూడా దీనిని అధికారికంగా ధృవీకరించింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు ఓటెత్తారు. అనూహ్యమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కనబరిచారు.
ఏపీలో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దారుణాలకు పాల్పడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎదిరించి నిలబడుతున్నారు.
వేసవి సెలవుల్లో సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి.. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారనే ఉద్దేశమే దీనికి కారణం. మూడు గంటలు ఏసీలో సినిమా ఎంజాయ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హాట్ సీట్ గా అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమేనని చెప్పవచ్చు. అటువంటి పిఠాపురంలో పోలింగ్ ముగిసిన తరువాత కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశా నిస్ఫృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.
ఆళ్ళగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ మీద హత్యాయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చేశారు.
సరిగ్గా ఎన్నికల వేళ ఐకాన్ స్టార్, మెగా హీరోలలో ఒకడు అయిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాను నంద్యాల వెళ్లి మిత్రుడికి మద్దతు తెలపడాన్ని అల్లు అర్జున్ సమర్ధించుకున్నాడు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు.ఒకే కుటుంబానికి ముగ్గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బుద్ధవనం-వారసత్వ ఉద్యానవనం అనేక పర్యాటక ప్రత్యేకతలతో, మన దేశంలోనే కాక, ఆసియా దేశాలో కూడా విలక్షణ బౌద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందని, బుద్ధవనం బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
ఏపీలో పోలింగ్ ముగిసింది. వైసీపీ మూకల అరాచకం, హింసాకాండ, బెదరింపులు, దాడులు ఇవేమీ పట్టించుకోకుండా జనం అపూర్వమనదగ్గ పట్టుదలతో ఓటు వేశారు. భారీ పోలింగ్ నమోదైంది. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఎన్నడూ లేనంద ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏదైనా జనజాతర జరుగుతోందా అన్నట్లుగా జనం పోటెత్తారు. రాష్ట్రం నుంచి వెళ్లి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నవారూ, ఉద్యోగాలు చేసుకుంటున్నవారూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ తండోపతండాలుగా తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.