వైసీపీ ఓటమి ఖాయం.. వీళ్ల మాటలే సాక్ష్యం!

Publish Date:May 15, 2024

Advertisement

ఏపీలో పోలింగ్ ముగిసింది. వైసీపీ మూకల అరాచకం, హింసాకాండ, బెదరింపులు, దాడులు ఇవేమీ పట్టించుకోకుండా జనం అపూర్వమనదగ్గ పట్టుదలతో ఓటు వేశారు. భారీ పోలింగ్ నమోదైంది. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. ఈ భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పుడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వైసీపీ ఓటమి దాదాపుగా ఖాయమైందని వారు చెబుతున్నారు. 

అయితే వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు, పరిశీలకులు విశ్లేషించడం కాదు.. స్వయంగా వైసీపీయే తన తీరు ద్వారా, వ్యాఖ్యల ద్వారా, ప్రదర్శిస్తున్న అసహనం ద్వారా ఓటమిని పోలింగ్ ముగియక ముందే అంగీకరించేసింది. ఇక ఆ పార్టీ అధినేత జగన్ అయితే  పోలింగ్ తేదీకి చాలా ముందుగానే బేలగా ఈ సారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అంటూ తన ఆందోళనను, ఓటమి భయాన్నీ వెళ్లగక్కేశారు. ఏదో పార్టీ సమావేశంలోనే, కీలక నేతలతో మంతనాల సమయంలోనే కాదు.. ఏకంగా బహిరంగ వేదికపై జగన్ ఈ మాటలు చెప్పి పార్టీ పరాజయం తథ్యమన్న సంకేతాలను జనానికే కాదు, సొంత పార్టీ క్యాడర్ కు కూడా ఇచ్చేశారు. 

ఇక ఆ పార్టీ కీలక నేత, మంత్రి రోజా అయితే పోలింగ్ జరుగుతుండగనే.. తాను ఓడిపోబోతున్నానని ప్రకటించేశారు. నగరి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పని చేశారని చెప్పారు. ఏకంగా మీడియా ముఖంగానే ఆమె ఈ మాటలు చెబుతూ వైసీపీ పరువు గంగలో కలిపేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తరువాత మాజీ మంత్రి, నెల్లూరు నుంచి నరసరావుపేటకు వలస వచ్చి మీసం తిప్పి తొడకొట్టి కూటమికి సవాలు చేసిన వైసీపి ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్‌ యాదవ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేశారు. సరిగ్గా ఇవే మాటలు చెప్పకపోయినా   టిడిపికి బలం ఉన్న చోట అసలు పోలీసులే లేరు. వాళ్ళను ఇష్టం వచ్చిన్నట్లు ఓట్లు వేసుకోమని వదిలేశారు. కానీ వైసీపికి బలం ఉన్న చోట వందలాది మంది పోలీసులను మోహరించి అడుగడుగునా నియంత్రించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసి అనిల్ కుమార్ వైసీపీ ఓటమి తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.  

ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే.. మీడియా సమావేశంలో భోరున ఏడ్చినంత పని చేశారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకూ పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారనీ, మంత్రినైన తాను చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు. సాధారణంగా ఓటమి ఖరారైన తరువాతే నేతల నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయి. పల్నాడు సహా పలు ప్రాంతాలలో వైసీపీ మూకలు రెచ్చిపోయి హింసాకాండకు, దౌర్జన్యాలకు తెగబడినా తెలుగుదేశం దీటుగా ప్రతిఘటించింది. పోలింగ్ సజావుగా సాగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఎక్కడా ఇలా వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రుల్లా బేల మాటలు మాట్లాడలేదు. రీపోలింగ్ కు డిమాండ్ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం చేతులెత్తేసింది. పోలింగ్ ఏకపక్షంగా జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. 

ఇవన్నీ ఒకెత్తైతే ఇలా పోలింగ్ ముగిసిందో లేదో అలా విదేశాలకు చెక్కేయడానికి జగన్ వేసుకున్న ప్లాన్, ఆయన విదేశాలకు వెడితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అంటూ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ తో జనానికి వైసీపీ ఓటమికి సాకులు, పలాయనానికి దారులు వేతుక్కుంటోందన్న సంకేతాలు ఇచ్చినట్లైంది.  

By
en-us Political News

  
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.