పిఠాపురం హీరో ఎస్వీఎస్ఎన్ వర్మ!

Publish Date:May 15, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హాట్ సీట్ గా అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమేనని చెప్పవచ్చు. అటువంటి పిఠాపురంలో పోలింగ్ ముగిసిన తరువాత కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశా నిస్ఫృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్లేషకులు కూడా ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ సాధించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ జరుగుతుండగానే వైసీపీ చేతులెత్తేసినట్లు కనిపించింది. వైసీపీ అభ్యర్థి వంగా గీత పోలింగ్ బూత్ ల సందర్శన సందర్భంగా ఓటర్లతో పంచాయతీ పెట్టుకోవడం, అసహనం వ్యక్తం చేయడం ద్వారా పరిస్థితి తనకు, తన పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేదన్న సంకేతాలు ఇచ్చారు. సరే ఇప్పుడిక పోలింగ్ ముగిసిపోయింది. ఫలితం కూడా దాదాపు అందరికీ తెలిసిపోయింది. మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఆసక్తి వ్యక్తం అవుతోంది. గెలుపు ఓటములపై కాకుండా మెజారిటీపైనే నియోజకవర్గంలో బెట్టింగులు జరుగుతున్నాయి. 

దీంతో జనసైనికులు ఇప్పుడు పిఠాపురంలో కొత్త హీరో అవతరించారంటూ ఆయనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.  పవన్ కల్యాణ్ లాంటి హీరోను మించి కొత్త హీరో ఎవరంటూ ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే జనసైనికులుస్వయంగా తమ అధినేతను మించి ఆ కొత్త హీరోనే ప్రశంసలతో ముంచె త్తుతున్నారు. ఆ కొత్త హీరో ఎవరంటే స్థానిక  తెలుగుదేశం నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఔను కూటమి శ్రేణులంతా ఆయననే హీరోగా అభివర్ణిస్తున్నారు.

కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే తెలుగుదేశంలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడి పని చేసి పార్టీని పటిష్టం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పిఠాపురం సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో ఎస్పీఎస్ఎన్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

అయితే ఎస్పీఎస్ఎన్ వర్మను చంద్రబాబు పిలిపించి మాట్లాడారో.. ఆ క్షణం నుంచీ నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిఠాపురంలో జనసేనానిని గెలిపించే బాధ్యతను వర్మ భుజానికి ఎత్తుకున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని విజయం ఖాయమనీ, అందుకు పూర్తి బాధ్యత తనదేననీ వర్మ చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కూ హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా తాను చంద్రబాబు శిష్యుడినననీ, ఆయన మాటే తనకు శిరోధార్యమనీ ప్రకటించారు. తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తిని మటుమాయం చేశారు. కూటమి అభ్యర్థి విజయానికి అందరినీ ఎకతాటిపైకి తీసుకువచ్చారు. 

 పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను దీటుగా తిప్పికొట్టడంలో వర్మ ప్రధాన పాత్ర పోషించారు.  వర్మ పవన్ కల్యాణ్ ఉద్రేకంతో, ఉద్వేగంతో పొరపాట్లు చేయకుండా ఎక్కడికక్కడ నియంత్రించారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సినీ హీరో పక్కన ఉన్నారన్న మొహమాటం లేకుండా సూటిగా, నిక్కచ్చిగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ ప్రచారంలో భాగంగా ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినపుడు కళ్లతోనే వారించారు. అందుకు సంబంధించిన వీడియో ను జనసైనికులే ఇప్పుడు వైరల్ చేస్తూ వర్మకు కృతజ్ణతలు చెబుతున్నారు.  పిఠాపురంలో నిజమైన హీరో వర్మే అంటూ ప్రస్తుతిస్తున్నారు.  

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.