ఆంధ్రప్రదేశ్ లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు!

Publish Date:Oct 9, 2024

Advertisement

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.  ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో  పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.  కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి.

అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.  జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్  ఐదేళ్ల  హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు  మొహం చాటేశాయి.  ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్టరానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు.  2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.

 ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా  జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన   లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారు తున్నది. తాజాగా  టాటా గ్రూప్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమెబైల్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది.  
టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో గత నెలలో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలకు కొనసాగింపుగా అన్నట్లు రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్లి నటరాజన్ చంద్రశేఖరన్ తో మంగళవారం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం లోకేష్ చేసిన ఓ ట్వీట్ రాష్ట్రంలో టాటా పెట్టు బడులు ఖాయమని తేల్చేసింది. నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అద్భుతంగా జరిగింది. బుధవారం(అక్టోబర్ 9)న రాష్ట్రంలో టాటా పెట్టుబడులకు సంబంధించి ఓ ప్రకటన వెలువడుతుందని లోకేష్ చేసిన ట్వీట్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుందన్న హింట్ ఇచ్చింది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురంలో టీసీఎష్ క్యాంపస్, రాయలసీమలో సెమికండక్టర్ ప్లాంట్, అనంతపురం సమీపంలో విమానాల తయారీ సంస్థల ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గొప్ప ఊతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏపీలో తిరుగు ఉండదు.  

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.