తమిళనాట మరో హీరో పొలిటికల్ ఎంట్రీ: కొత్త పార్టీ పేరుతో ధనుష్ సెన్సేషన్.!
Publish Date:Oct 7, 2026
Advertisement
తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయ్యిందా? అంటే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఔనన్న సమాధానమే వస్తున్నది. స్టార్ హీరో ధనుష్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైందన్న వార్త ఇప్పుడు తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ధనుష్ రాజకీయ ప్రవేశంపై గత కొద్ది కాలంగా వార్తలు వినవస్తూనే ఉన్నాయి. తమిళనాడులో కోట్లాది మంది అభిమానులు ఉన్న ధనుష్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు వేగంగా పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ధనుష్.. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుతెలుస్తోంది. ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణనా లేదు. గత కొంతకాలంగా ధనుష్ రాజకీయ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు పార్టీ పేరు తెరపైకి రావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విధివిధానాలు, పార్టీ జెండా, భవిష్యత్ కార్యాచరణపై ధనుష్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. [Tamil Hero Dhanush political entry, Tamilaga Eluchi Kazhagam, Dhanush New Party, Kollywood Actor, Political Entry, Tamil Nadu Politics,Telugu One]
http://www.teluguone.com/news/content/tamil-hero-dhanush-political-entry-25-233651.html




